Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే పూర్తి కాలేదు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మరియు ‘బ్రో’ చిత్రాలను పూర్తి చేసాడు. డైరెక్టర్ సుజిత్ తో ‘#OG’ అనే చిత్రం షూటింగ్ లో కూడా చురుగ్గా పాల్గొంటూ అప్పుడే 30 శాతం షూటింగ్ ని పూర్తి చేసాడు.
మరోపక్క హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ని ప్రారంభించి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసాడు.ఇలా అన్నీ చకచకా పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విషయం లో మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు. కావాలనే చేస్తున్నాడా?, లేదా నిర్మాతకి బడ్జెట్ సమస్య తలెత్తడం వల్ల ఆలస్యం అవుతుందా? ఇత్యాది ప్రశ్నలు అభిమానుల్లో నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవన్నీ కాదట, డైరెక్టర్ క్రిష్ వద్ద ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే ఇంత ఆలస్యం అవుతూ వస్తుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం.ఇప్పటికైతే ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తి అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ కి స్క్రిప్ట్ సమస్య వచ్చింది, పూర్తి స్థాయి కథ ఆయన దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ ఉంటేనే డేట్స్ ఇస్తానని, అప్పటి వరకు షూటింగ్ చేసే సమస్యే లేదని చెప్పాడట. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 40 శాతం షూటింగ్ ఉందట.
ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ కి నచ్చకపోవడం తో ఆయన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వ సారధ్యం లో రీ షూట్ చేయించాడట. మరికొన్ని సన్నివేశాల కోసం హరీష్ శంకర్ సహాయం కూడా తీసుకొని రీ షూట్స్ చేయించాడట.కేవలం డైరెక్టర్ క్రిష్ అసమర్థత వల్లే ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతుందని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.