Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చాలామంది డైరెక్టర్లు వాళ్లకంటూ ప్రత్యేకతను చాటుకోవడానికి సినిమాలను చేస్తూ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇక తదనంతరం రాజమౌళి లాంటి డైరెక్టర్లు మాస్ సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన తర్వాత పాన్ ఇండియా లెవల్లో భారీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వాళ్లకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకెళ్తున్నారు.ఇక ఇప్పుడు ఈయన పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల నుంచి రాజమౌళికి పోటీ ఎవరు లేరు, ఎవరు రారు అని అందరూ అనుకున్నారు కానీ అనిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ రాజమౌళి కి పోటీ ఇచ్చే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఆయనకంటూ ఒక సపరేట్ మేకింగ్ స్టైల్ తో ప్రతి సీను కూడా రక్తి కట్టించడంలో సందీప్ సిద్ధహస్తుడు అనే చెప్పాలి.అయితే రాజమౌళి స్టాండర్డ్ వేరు, సందీప్ స్టాండర్డ్ వేరు అయినప్పటికీ రాజమౌళి కి పోటీ ఇచ్చే దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియా మొత్తం లో సందీప్ రెడ్డి వంగ ఒకడు మాత్రమే ఉన్నాడు అని చెప్పాలి…ఇక ఈ విషయం మీద ఇంతకుముందు రాజమౌళి కూడా స్పందించారు. తనకి ఇండియాలో పోటీ ఇచ్చే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక సందీప్ రెడ్డి వంగ మాత్రమే అని ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు…
అయితే ప్రస్తుతం ఎనిమల్ సినిమా నాలుగు రోజుల్లో 400 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. అనిమల్ అనే ఒక టైటిల్ కి కరెక్ట్ గా జస్టిఫికేషన్ ఇస్తూ ఈ సినిమాని తెరకెక్కించాడు సందీప్… ఇలాంటి సినిమాలు తెరకెక్కించాలి అంటే ముందుగా చాలా ఘట్స్ ఉండాలి. అలాంటి ఘట్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కి మాత్రమే ఉన్నాయి.
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు అనిమల్ సినిమాతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా లెంత్ ఎక్కువగా ఉన్నా కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా సినిమాను చూస్తున్నారు. అలాగే సెకండ్ టైం కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… సందీప్ రెడ్డి వంగ అంటే ఇప్పుడు ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు…