Mahesh Babu strong point: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు మహేష్ బాబు…ఆయన చేసిన సినిమాలతో గొప్ప విజయాలను సాధించాడు. తన స్ట్రాంగ్ జోన్ ఏంటి అనే విషయంలో ఆయన ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. తను చేసే మాస్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా అదరిస్తున్నారు. తను ఎలాంటి పాత్రలు చేస్తే ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయాల పట్ల మహేష్ బాబు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటారట. దీనివల్ల ప్రేక్షకులు గానీ, అభిమానులు గాని తన నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్ళకి ఇవ్వడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటాడు. గతంలో ఒక్కడు, పోకిరి, బిజినెస్ మాన్, దూకుడు లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పుడు వైవిధ్యభరైతమైన యాక్టింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
‘వారణాసి’ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మహేష్ బాబు నుంచి మాస్ సినిమాలను కోరుకున్న ప్రేక్షకులు వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చుతున్నారు. కాబట్టి మహేష్ బాబు వారణాసి లాంటి సినిమాని చేస్తున్నాడు.
మహేష్ బాబు ఒక సినిమా మీద ఎక్కువ రోజులు పాటు సమయానికి కేటాయించే అవకాశమైతే లేదు. ప్రస్తుతం తను ఉన్న బిజీ కి వీలైనంత తొందరగా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో రాజమౌళి లాంటి దర్శకుడితో దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్న మహేష్ బాబు మరో సంవత్సరం పాటు అదే సినిమా మీద కొనసాగాల్సిన అవసరమైతే ఉంది…
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ఈ మూవీ అతనికి ఎలాంటి గుర్తింపును సంపాదించి పెడుతుంది అనేది తెలియాల్సి ఉంది… 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోసారి మహేష్ బాబు తన స్ట్రాంగ్ జోన్ లో నటించడమే కాకుండా ఐదు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు…