Rajamouli: రాజమౌళి సినిమా వస్తుందంటే ఎదురుచూసే వారు ఎందరో ఉంటారు. జక్కన్న సినిమా అంటే రేంజ్ మరో విధంగా ఉంటుంది. బాహుబలి సినిమా నుంచి జక్కన్నకు అభిమానులు మరింత పెరిగాయి. బాహుబలి 2 కోసం అభిమానులు మరింత పెరిగారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. అయితే ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా భారీ విజయం పక్కా అంటూ చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమా తర్వాత జక్కన్న ఎవరితో సినిమా చేయబోతున్నారో తెలుసా?
మహేష్ తో సినిమా షూటింగ్ కూడా మొదలవలేదు. కానీ ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు పెరగడం గమనార్హం. సినిమా షూటింగ్ మొదలై ఫస్ట్ లుక్ వస్తే ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. ఈ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు అంటే అందులో ఏదో ఒక కొత్త అంశం ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు చేయడంలో ఈయన ముందుంటారు. అందుకే రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ ను పొగడని వారుండరు. ఈ రేంజ్ బాహుబలి సినిమాతోనే వచ్చిందనడంలో సందేహం లేదు.
రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత స్టార్ హీరో సూర్యతో సినిమా చేయబోతున్నారని టాక్. ఇప్పటికే సూర్యతో సినిమా చేయాలనుకున్నారట. కానీ డీలే అవుతూ వస్తుందట. మగధీర తర్వాతనే సూర్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డీలే అయింది. అందుకే మహేష్ బాబుతో సినిమా తర్వాత సూర్యతో చేస్తారని టాక్. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సూర్యకు కూడా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమా ఏంటో? కథ ఏంటో తెలుసుకోవాలంటే వేచి ఉండాల్సిందే.