https://oktelugu.com/

NTR And Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్ కారణంగా హీరో సూర్య కెరీర్ పూర్తిగా దెబ్బ తినిందా..? ఫ్యాన్స్ ముందు ఎమోషనల్ అయిన సూర్య!

నవంబర్ 14 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభించి చాలా రోజులైంది. బుకింగ్స్ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకి కనీసం లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదంటే, బుకింగ్స్ ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 / 08:03 PM IST

    NTR And Ram Charan

    Follow us on

    NTR And Ram Charan: ప్రస్తుతం సౌత్ ఇండియా నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ కాకుండా, పాన్ ఇండియన్ స్టార్ హీరోలు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్. వీళ్ళ సినిమాలు టాలీవుడ్ రేంజ్ ని ఎప్పుడో దాటిపోయాయి. ప్రభాస్ స్టార్ స్టేటస్ అయితే రజినీకాంత్, షారుఖ్ ఖాన్ లను కూడా దాటేసింది. అయితే వీళ్లందరి కంటే ముందు సౌత్ ఇండియా లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం మరియు హిందీ భాషల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నటుడు సూర్య. అప్పట్లో ఈయన సినిమాల ఓపెనింగ్స్ రజినీకాంత్ తో సమానంగా ఉండేవి. తమిళ ఆడియన్స్ మాత్రమే కాకుండా, తెలుగు ఆడియన్స్, మలయాళం ఆడియన్స్ సూర్య ని తమ సొంత ఇండస్ట్రీ కి చెందిన హీరోలాగా భావిస్తుంటారు. అలాంటి రేంజ్ ని సంపాదించుకున్న సూర్య, మధ్యలో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ కారణంగా బాగా డౌన్ అయ్యాడు. ఇప్పుడు ‘కంగువ’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

    నవంబర్ 14 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభించి చాలా రోజులైంది. బుకింగ్స్ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకి కనీసం లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదంటే, బుకింగ్స్ ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా అదిరిపోయే రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సూర్య రాజమౌళి ని ఉద్దేశిస్తూ సూర్య మాట్లాడుతూ ‘మీతో పని చేసే అవకాశం ఒకసారి వచ్చింది, నా దురదృష్టం కొద్దీ మిస్ అయ్యాను. భవిష్యత్తులో మళ్ళీ మీతో కలిసి పని చేసే అవకాశం వస్తుందని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంతకీ సూర్య, రాజమౌళి కాంబినేషన్ మిస్ అయిన సినిమా మరేదో కాదు, మగధీరనే. ఈ కథ ముందుగా రాజమౌళి సూర్య తో అనుకున్నాడట, కానీ అప్పట్లో ఎందుకో ఈ ప్రాజెక్ట్ కుదర్లేదు. అదే విధంగా #RRR చిత్రంలో కొమరం భీం క్యారక్టర్ కోసం ముందుగా సూర్యనే అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టడం తో ఆ క్యారక్టర్ కూడా మిస్ అయ్యింది. అలా రామ్ చరణ్, ఎన్టీఆర్ కారణంగా సూర్య రెండు సార్లు రాజమౌళి తో సినిమాలు చేసే అవకాశాలు కోల్పోయాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రెండు సినిమాలు సూర్య ఒప్పుకొని చేసి ఉండుంటే ఈరోజు ఆయన కెరీర్ ఎలా ఉండేదో. అదృష్టం కలిసి రావాలి అని పెద్దలు అనేది ఇందుకే. భవిష్యత్తులో అయినా సూర్య, రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందో లేదో చూద్దాం.