Chiranjeevi Godfather: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న రెండవ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్..ఈ ఏడాది చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో మన అందరికి తెలిసిందే..140 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి కనీసం 50 కోట్ల రూపాయిల షేర్ కూడా రాలేదు..మృగరాజు తర్వాత చిరంజీవి కెరీర్ లో అంత పెద్ద డిజాస్టర్ సినిమా అంటే ఇదే..అలాంటి ఫ్లాప్ తర్వాత విడుదలవుతున్న సినిమా కావడం తో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా పై కోటి ఆశలు పెట్టుకున్నారు..అక్టోబర్ 5 వ తారీఖున ఈ సినిమా తెలుగు మరియు హిందీ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..విడుదల తేదీ అయితే ప్రకటించారు కానీ..ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ మాత్రం నత్త నడకన సాగుతున్నాయి.

ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించి ఒక్క లిరికల్ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చెయ్యలేదు ..నిన్న సల్మాన్ ఖాన్ – చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మార్ మార్ టక్కర్ మార్’ పాటని లిరికల్ వీడియో గా విడుదల చేస్తాము అని ప్రకటన చేసారు..కానీ ఆ పాటని టెక్నికల్ లోపం వల్ల విడుదల చేయలేకపోయాము అంటూ ఒక ట్వీట్ వేసి కేవలం ఆడియో ని మాత్రమే రిలీజ్ చేసారు..ఆ ఆడియో కి వచ్చిన రెస్పాన్స్ కూడా అంతంత మాత్రమే..ఎక్కడో విన్నామే అన్నట్టు అనిపించింది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు థమన్ టాగ్ చేసి తిడుతున్నారు.

చిరంజీవి సినిమా విడుదల అంటే, విడుదలకి పది రోజుల ముందు నుండే పండగ వాతావరణం నెలకొంటుంది..కానీ ఈ చిత్ర నిర్మాతలు అభిమానులకు కూడా కనీసం ఉత్సాహం రప్పించలేకపోతున్నారు..చిరంజీవి కూడా ఈ సినిమా పట్ల అంత ఉత్సాహం గా లేనట్టు కనిపిస్తుంది..ఆయన తన గత చిత్రాల ప్రొమోషన్స్ ని నెల రోజుల ముందు నుండే ప్రారంభించారు..కానీ గాడ్ ఫాదర్ సినిమా పట్ల ఎదో మొక్కుబడిగా వ్యహరిస్తునట్టు అభిమానులకు కలుగుతున్న ఫీలింగ్..అంటే ఈ సినిమా ఔట్పుట్ చిరంజీవి గారికి నచ్చలేదా..అందుకే ప్రొమోషన్స్ ని తేలికగా తీసుకుంటున్నారా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి..అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చిరంజీవి గారికి అసలు నచ్చలేదట..రీ షూట్ పెట్టిన తర్వాత ఓకే చేసాడు..ఒరిజినల్ వెర్షన్ కంటే బాగా వచ్చింది..చిరంజీవి గారు యాక్టింగ్ ఇరగదీసాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్..చూడాలిమరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉంది అనేది.