Harshvardhan Rameshwar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga)…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్య భరితమైన ఎలిమెంట్ అయితే ఉంటుంది. దానికోసమే ఆయన అభిమానులతో పాటు యావత్ ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన మొదటి సినిమా అయిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) భారీ రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా మొదటి సినిమాతోనే చాలా టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అనిమల్(Animal) సినిమా అయితే కంప్లీట్ బోల్డ్ సినిమాగా తెరకెక్కడమే కాకుండా రన్బీర్ కపూర్ (Ranbeer Kapoor) కెరియర్ ను మార్చేసిందనే చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలకి మ్యూజిక్ ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ( Harshavardhan Rameshvar) ప్రస్తుతం సందీప్, ప్రభాస్ (Prabahs) తో చేయబోతున్న స్పిరిట్ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు…నిజానికి అర్జున్ రెడ్డి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రదన్ అయినప్పటికి ఆయన బిహేవియర్ నచ్చకపోవడం వల్ల సందీప్ రెడ్డివంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను చేయడానికి హర్షవర్ధన్ రామేశ్వరన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి వీళ్ళ బాండింగ్ అనేది మొదలైంది. దాంతో అనిమల్ (Animal) సినిమా కి కూడా మ్యూజిక్ అందించి ఆ మూవీ ని సూపర్ సక్సెస్ చేశారు…
ఇక ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో కూడా తనని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే రథన్ దగ్గర కీబోర్డు ప్లేయర్ గా పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలోని ఓ మనిషి ఓ మహర్షి అనే సాంగ్ లో ఒక పెక్కులర్ విజిలైతే వస్తుంది. దానికోసం ఆయన చాలావరకు కష్టపడ్డట్టుగా తెలుస్తోంది.
ఒక ఇన్స్ట్రుమెంట్ ని తీసుకొచ్చి నోటి ద్వారా ముక్కు ద్వారా ఒకే సమయంలో గాలి ఊదితే అది ఒక విజిల్ టైప్ లో సౌండ్ అనేది వస్తుంది. దానికోసం అయినా చాలా గంటల పాటు కష్టపడి ఆ పెక్యూలర్ విజిల్ సౌండ్ అయితే క్రియేట్ చేశారట. ఇక ఆ విజిల్ సౌండ్ సందీప్ రెడ్డి కి బాగా నచ్చిందట.
అయితే ‘ఎవడే సుబ్రమణ్యం ‘ (Evade Subramanyam) సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కావడం తో ఆ విజిల్ సౌండ్ నచ్చే నేను రధన్ దగ్గరికి వచ్చాను అని సందీప్ చెప్పారట. హర్షవర్ధన్ రామేశ్వర్ ఆ విజిల్ సౌండ్ ఇచ్చింది నేనే అని చెప్పడంతో సందీప్ కి హర్షవర్ధన్ రామేశ్వర్ కి మధ్య మరింత బాండింగ్ అయితే పెరిగిందట. ఇక మొత్తానికైతే ఒక విజిల్ సౌండ్ అనేది వీళ్లిద్దరిని కలపడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…