Harish Shankar: సరిగ్గా మరో 42 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ప్రమోషనల్ కార్యక్రమాలు ఇంకా మొదలు అవ్వలేదు. డిసెంబర్ లో విడుదల చేసిన ‘దేఖ్లేంగే సాలా’ పాట తప్ప, ఇప్పటి వరకు ఈ చిత్రం ఒక్క కంటెంట్ కూడా రాలేదు. ‘దేఖ్లేంగే సాలా’ పాటకు లిరిక్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ మాత్రం చాలా నాసిరకంగా ఉండడం తో అభిమానులు చిరాకు పడ్డారు. కానీ చిన్నగా ఆ పాటకు అలవాటు పడ్డారు. ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి ఎలివేషన్స్ వేస్తూ, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ తో రీసెంట్ గానే లిరిక్స్ రాయించి, దేవి శ్రీప్రసాద్ చేత ఒక ట్యూన్ ని చేయించుకున్నాడు హరీష్ శంకర్.
ఈ పాట అద్భుతంగా వచ్చిందని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా పదే పదే ఊదరగొడుతూ అభిమానులను ఊరిస్తున్నాడు. పాట ఆయనకు తెగ నచ్చడం తో వెంటనే దేవిశ్రీ ప్రసాద్ ని ఆనందంతో చంద్రబోస్ తో కలిసి పైకి లేపడం హాట్ టాపిక్ గా మారింది. నేను సాధారణంగా ఇలాంటివి చేయను, అలాంటి నేను ఇలా చేసానంటే, ఆ సాంగ్ ఎంత అద్భుతంగా వచ్చిందో మీరే ఊహించుకోండి అంటూ ట్వీట్స్ వేస్తున్నాడు హరీష్ శంకర్. అయితే ఎంతసేపు ఇలాంటి మాటలే తప్ప, సినిమా నుండి కంటెంట్ ఒక్కటి కూడా బయటకు రాకపోవడం తో అభిమానులకు చిరాకు వచ్చి హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు. ఒకప్పటి హరీష్ శంకర్ అయితే అభిమానులను బ్లాక్ చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా కూల్ గా సమాధానం చెప్పాడు.
ఆయన మాట్లాడుతూ ‘అభిమానులారా కాస్త సహనం వహించండి. ప్రతీ ఒక్కటి సిద్ధంగా ఉంది, ముహూర్తం ఫిక్స్ చేశాం, ఇక ఈ సినిమా నుండి కంటెంట్ ఒక్కొక్కటిగా వరద లాగా పారే సమయం వచ్చేసింది. నమ్మకం ఉంచండి’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ‘#TheAuraOfUstaad’ చరణం తో మొదలయ్యే ఈ పాట , ఒక్కసారి విడుదలయ్యాక సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుందని అంటున్నారు. జల్సా టైటిల్ సాంగ్ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో, ఈ పాట కూడా ఆ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. చూడాలి మరి, ఈ పాటకు ఆ రేంజ్ ఉందా లేదా అనేది.
On the way …….. guys …..
Everything has its own timing
You will celebrate this one
for now …..
Pls trust the process…..
Flood of updates is coming soon #AuraOfUstaad @UBSTheFilm @ThisIsDSP #Chandrabose https://t.co/F1R5PfIpEw
— Harish Shankar .S (@harish2you) February 12, 2026