Harish Shankar Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు తమ అభిమాన హీరో ని డ్యాన్స్ చేయడం చూసి చాలా ఏళ్ళు అయ్యింది. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన ఒక్క సినిమాలో కూడా డ్యాన్స్ లేదు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో చేసాడు కానీ, అది కాస్త పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్మెంట్స్ లో చూపించాలంటే కచ్చితంగా హరీష్ శంకర్ రంగం లోకి దిగాల్సిందే అని అభిమానులు సోషల్ మీడియా లో అనుకుంటూ ఉండేవారు. వాళ్ళు కోరుకున్న విధంగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం లో పవన్ కళ్యాణ్ చేత డ్యాన్స్ చేయించాడు హరీష్ శంకర్. కాసేపటి క్రితమే విడుదలైన ఈ సినిమాలోని ‘దేఖ్లేంగే సాలా’ పాట కి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఎలాంటి డ్యాన్స్ కోరుకున్నారో, అలాంటి డ్యాన్స్ చేయించి చూపించాడు.
అభిమానులు కాసేపు మేము చూస్తున్నది పవర్ స్టార్ నేనా?, అసలు ఈ రేంజ్ మూవ్మెంట్స్, అది కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి చూస్తామని కలలో కూడా ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆనందభాష్పాలతో ట్వీట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ రాజమండ్రి లోని ఆదిత్య కాలేజ్ లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత నవీన్ ఎర్నినేని, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసే ముందు శ్రేయాస్ మీడియా వారు మీవి మంచి ఫోటోలు పంపని, కటౌట్స్ చేయిస్తున్నాము అని అన్నారు. నేను ఎవరి కటౌట్స్ పెట్టొద్దు, కేవలం పవన్ కళ్యాణ్ మరియు దేవిశ్రీప్రసాద్ కటౌట్స్ మాత్రమే అక్కడ ఉండాలి’.
‘నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి రాకముందు నుండే నేను దేవిశ్రీ కి పెద్ద ఫ్యాన్ ని. ఆనందం సినిమా మ్యూజిక్ విని, పని చేస్తే ఇలాంటి డైరెక్టర్ తో పని చెయ్యాలని అనుకున్నాను. ఆయనతో కలిసి మూడు సినిమాలు పని చేయడం నా అదృష్టం. చాలా మంది ఈ సినిమా గురించి సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో ఎన్నో గాసిప్స్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని పూర్తి చేయడానికి సమయం ఇవ్వలేదని అన్నారు. కానీ ఈ సినిమా కోసం ఆయన రోజుకి 18 గంటలు పనిచేసేవాడు. ఇంతలా ఆయన ప్రాణం పెట్టి పనిచేశాడు.ముందుగా మేము కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ చెయ్యాలని అనుకున్నాం, ఆ తర్వాత కుదరక ఒక రీమేక్ చేద్దామనుకున్నాము. అది కూడా సంతృప్తి ని ఇవ్వలేదు. ఆ సమయం పుట్టుకొచ్చిన సినిమానే ఈ ఉస్తాద్ భగత్ సింగ్. అభిమానులు జీవితాంతం గర్వంగా చెప్పుకునే సినిమా అవ్వుధి’ అంటూ చెప్పుకొచ్చాడు.
