Messi Vs CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy), ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ(Messi) తో కలిసి నేడు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయంగా ఎన్నో సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పి, కోట్లాది మంది క్రీడా అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ ని హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం కి తీసుకొని రావడం లో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. నేడు వీళ్లిద్దరు కలిసి గ్రౌండ్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు, అనంతరం పెనాల్టీ షూటౌట్ లో రేవంత్ రెడ్డి గోల్ కొట్టగా, మెస్సీ అందుకు చప్పట్లు కొట్టాడు. అనంతరం మెస్సీ మరియు రేవంత్ కలిసి గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. ఒక రాష్ట్ర సీఎం ఇలా ఉత్సాహంగా ఫుట్ బాల్ క్రీడలో పాల్గొనడం బహుశా చరిత్ర లో ఇదే తొలిసారి అనొచ్చు.
గ్రౌండ్ లో వీళ్లిద్దరు ఆడుతున్నంత సేపు అభిమానుల కేరింతలు, చప్పట్లతో స్టేడియం మారుమోగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసి రేవంత్ రెడ్డి, మెస్సీ మ్యూచువల్ అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ని మెస్సీ కేవలం ఫుట్ బాల్ క్రీడని ప్రమోట్ చేయడం కోసం మాత్రమే హైదరాబాద్ కి వస్తున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్లే ఇది సాధ్యమైందని, ఇది నిజమైన ఫుట్ బాల్ మ్యాచ్ కాదంటూ తెలంగాణ డీజీపీ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్య మంత్రి స్థానం లో కూర్చున్నప్పుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి జెర్సీ వేసుకొని మరీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఇదే ఆయన అలంకరించిన పదవిపై తనకు ఉన్న చిత్తశుద్ధి అంటూ విమర్శలు చేస్తున్నారు.
VIDEO | Hyderabad: Argentine football icon Lionel Messi graces the field at Rajiv Gandhi International Cricket Stadium and plays football with Telangana CM Revanth Reddy.
(Source: Third Party)#MessiInIndia #Hyderabad #Telangana pic.twitter.com/O4DZ0OcIhC
— Press Trust of India (@PTI_News) December 13, 2025
Dribbles and passes with the GOAT himself! ⚽
Telangana CM Shri @revanth_anumula shared a fun moment with Lionel Messi at the Rajiv Gandhi International Stadium in Hyderabad.
Telangana pic.twitter.com/JcJL9g6PyO
— Congress (@INCIndia) December 13, 2025
VIDEO | Hyderabad: Argentine football icon Lionel Messi entertains fans at Rajiv Gandhi International Cricket Stadium, playfully kicking the ball to the crowd gathered in the stadium.
(Source: Third Party)#MessiInIndia #Hyderabad pic.twitter.com/AE5kd5YWhw
— Press Trust of India (@PTI_News) December 13, 2025