Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా రేపు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ ట్రైలర్ గురించి ఫిలిం నగర్ లో మంచి బజ్ కూడా ఏర్పడింది. ఇది పవన్ కళ్యాణ్ బాహుబలి అంటూ చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే నిన్న ప్రైవేట్ స్క్రీనింగ్ లో పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని చూపించారు మేకర్స్. అందుకు సంబంధించిన వీడియో ని కాసేపటి క్రితమే ట్విట్టర్ లో విడుదల చేశారు.
ఈ వీడియో లో పవన్ కళ్యాణ్ ట్రైలర్ ని చూస్తున్న ఫోటోలు మొత్తం కలిపారు. చివర్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ ని అభినందిస్తూ చాలా బాగా కష్టపడి తీశారు అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ వీడియో లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ గురించి మన అందరికీ తెలిసిందే, ఒకే తల్లి కడుపున పుట్టకపోయిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని తన సొంత సోదరుడిగా భావిస్తాడు. ఎక్కడికి వెళ్లినా తన పక్కనే త్రివిక్రమ్ ని పెట్టుకుంటాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాల సెలెక్షన్స్ కూడా ఆయన చేస్తుంటాడు. ‘హరి హర వీరమల్లు’ కష్టమైన సమయం లో ఉన్నప్పుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి బ్యాక్ బోన్ లాగా నిలిచి ఈ సినిమాని పూర్తి చేయడంలో సహాయపడ్డాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన టాక్.
ఈరోజు త్రివిక్రమ్ ని చూసిన తర్వాత అది నిజమే అని అనిపిస్తుంది. ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ సమయం లో త్రివిక్రమ్ సహాయ సహకారాలు చాలా వరకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ తీసుకున్నాడని, అందుకే సినిమా పూర్తి అయ్యి, ఈ నెల 24 న విడుదలకు సిద్ధం అయ్యిందని అంటున్నారు. అంతే కాకుండా నిర్మాత AM రత్నం కి ఫైనాన్షియల్ సమస్యలు ఉండడం తో తన బంధువైన నాగవంశీ ని ఈ సినిమాకు సమందించిన ఆంధ్ర రైట్స్ ని కొనుగోలు చేసి స్మూత్ రిలీజ్ ఉండేలా చేసాడు. ఇలా ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన ఆపన్న హస్తం ఎంతో అమోఘమైనది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలాంటి స్నేహితుడు ప్రతీ ఒక్కరి జీవితం లో ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.