Hari Hara Veeramallu: పవన్ ఫ్యాన్స్ కు హరిహర వీరమల్లు సర్ ప్రైజ్ గిఫ్ట్

Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు కరెక్ట్ పాత్ర దొరికితే ఎలా చెడుగుడు ఆడేస్తాడన్నది ఇటీవల ‘వకీల్ సాబ్’సినిమాలో చూశాం. ఆ సినిమాలో పవన్ వీరావేశం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కాసుల వర్షం కురిపించింది. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లు కావాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) పురాతన కాలంలో తెలుగు గడ్డపై పోరాడిన బందిపోటు ‘హరిహర వీరమల్లు’ కథను ఎంచుకున్నాడు. పవర్ […]

Written By: NARESH, Updated On : September 2, 2021 3:57 pm
Follow us on

Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు కరెక్ట్ పాత్ర దొరికితే ఎలా చెడుగుడు ఆడేస్తాడన్నది ఇటీవల ‘వకీల్ సాబ్’సినిమాలో చూశాం. ఆ సినిమాలో పవన్ వీరావేశం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కాసుల వర్షం కురిపించింది. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లు కావాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) పురాతన కాలంలో తెలుగు గడ్డపై పోరాడిన బందిపోటు ‘హరిహర వీరమల్లు’ కథను ఎంచుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు ఆయన ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు దర్శకుడు క్రిష్. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న చారిత్రక మూవీ ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి పుట్టినరోజు కానుకగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

బందిపోటు దొంగగా మొగలులను ఎదురించిన ‘హరిహర వీరమల్లు’ చరిత్రను సినిమాగా తీస్తున్నారు. పవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ తోపాటు రిలీజ్ డేట్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. హరిహర వీరమల్లు చిత్రాన్ని 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది.

దాదాపు 170 కోట్ల వ్య‌యంతో.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా నిర్మిస్తున్నారు మెగా ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం. అంతేకాకుండా.. ప‌వ‌న్ కెరీర్లో తొలి హిస్టారిక‌ల్ మూవీ కూడా ఇదే కాబోతోంది. ఇలా.. ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను సొంతం చేసుకున్న ఈ మూవీలో యాక్ష‌న్ సీన్స్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉండ‌బోతున్నాయ‌ట‌.

అంత‌కంత‌కూ హై రేంజ్ క్యూరియాసిటీని ఫిల్ చేస్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి మ్యూజిక్ తోడ‌వ‌డంతో.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోన‌నే అంచ‌నాలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, బాలీవుడ్ భామ జాక్వెలిన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.