Homeఎంటర్టైన్మెంట్Hari Teja: మన హరితేజ ఇలా మారిపోయిందేంటి? షాకింగ్ పిక్ వైరల్

Hari Teja: మన హరితేజ ఇలా మారిపోయిందేంటి? షాకింగ్ పిక్ వైరల్

హరితేజ 1989 ఫిబ్రవరి 26న తిరుపతిలో జన్మించారు. తన చదువు పూర్తి చేశాక మీడియాలో అడుగు పెట్టింది. ఓ టీవీ చానెల్ లో యాంకర్ గా పనిచేసిన ఆమె 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో హీరోయిన్ అత్తగా నటించింది.

Hari Teja: తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ల తో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా గుర్తింపు ఉంది. టీవీల్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు సినిమాల్లో మంచి పాత్రలను పోషిస్తున్నారు. వీరిలాగే యాంకర్ గా పనిచేసిన హరితేజ ఆ తరువాత సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యారు. ప్రఖ్యాత రియాల్టీ షో బాగ్ బాస్ 1లో ఛాన్స్ తెచ్చుకొని ఫైనల్ వరకు చేరారు. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి హరితేజ కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ఆమె లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిని చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

హరితేజ 1989 ఫిబ్రవరి 26న తిరుపతిలో జన్మించారు. తన చదువు పూర్తి చేశాక మీడియాలో అడుగు పెట్టింది. ఓ టీవీ చానెల్ లో యాంకర్ గా పనిచేసిన ఆమె 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో హీరోయిన్ అత్తగా నటించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీ సీరియళ్లలో నటించింది. 2011లో మనసు మమత అనే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత రక్తసంబంధం, అభిషేకం, కన్యాదానం లాంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లో మంచి పొజిషన్లో కొనసాగుతుండగానే హరితేజ 2017లో దీపక్ రావు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో హరితే ప్రెగ్నెన్సీ అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తనకు సంబంధించిన ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అలరించేంది. కరోనా ఉధృతి తగ్గకముందే 2021 ఏప్రిల్ 5న వీరికి ఒక పాప జన్మించింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాకు కూడా దూరమైంది. సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేసినన్నాళ్లు హరితేజ బొద్దుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయారు.

పూర్తిగా స్లిమ్ గా మారిన హరితేజ తన పాపతో కలిసి ఆడుకుంటున్న కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా మంది పిల్లలు పుట్టాక లావవుతారు. కానీ హరితేజ ఇలా మారడంపై షాక్ అవుతున్నారు. హీరోయిన్ కాకున్నా హరితేజకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగే తనను బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో ఫైనల్ వరకు తీసుకెళ్లింది. ఆ తరువాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం హరితేజ అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper