Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి అడ్డంకులు మొత్తం తొలగినట్టే. ఎన్నో ఏళ్ళ నుండి తెరకెక్కుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటుంది. జూన్ 12 న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం చివరి క్షణం లో వాయిదా పడడం అభిమానులను ఎంత నిరాశకు గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఫ్యాన్స్ ఓపిక ని కూడబెట్టుకొని ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారంలో థియేట్రికల్ ట్రైలర్ అప్డేట్ ఇస్తామని మేకర్స్ ఇది వరకే చెప్పారు. కానీ ఈరోజు వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం తో అభిమానులు కాస్త అసహనానికి గురయ్యారు. ఈలోపే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని వచ్చే నెల 3 వ తేదీన విడుదల చేయబోతున్నారు అని తెలియడం తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ ని వకీల్ సాబ్ ట్రైలర్ లాగా థియేటర్స్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకు ఇప్పటికే 45 థియేటర్స్ ని ఎంచుకున్నారు. మరో 40 థియేటర్స్ ని అదనంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే జులై 4 న నితిన్(Hero Nithin) హీరో గా నటించిన ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ని జత చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకవేల జులై 3 న థియేటర్స్ లో చూడడం మిస్ అయితే, జులై నాల్గవ తేదీ నుండి తమ్ముడు మూవీ థియేటర్స్ లో చూడొచ్చు. ట్రైలర్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు సోమవారం రోజున జరిగే అవకాశాలు ఉన్నాయి.
కాస్త ముందస్తుగా ఈ ట్రైలర్ ని విడుదల చేసుంటే కుబేర చిత్రానికి జత చేసి ఉండొచ్చు కదా అని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే కమర్షియల్ గా కుబేర భారీ బ్లాక్ బస్టర్, ఈ సినిమాని అత్యధిక శాతం మంది జనాలు చూసారు కాబట్టి ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ కూడా అందరికీ చేరువ అయ్యేదని అంటున్నారు. అయితే అభిమానులు ఇన్ని రోజులు ఎదురు చూసిన ఎదురు చూపులకు ఈ ట్రైలర్ సరైన సమాధానం అని అంటున్నారు మేకర్స్. బాహుబలి, కల్కి చిత్రాలకు ఈ చిత్రం మేకింగ్ విషయం లో ఏ మాత్రం తీసిపోదని అంటున్నారు. అదే కనుక నిజమైతే ఓపెనింగ్స్ అనకాపల్లి నుండి అమెరికా వరకు అభిమానులు కూడా ఊహించని విధంగా ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జులై 3 నుండి జరగబోయే ప్రొమోషన్స్ ని చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతారట. ఆ రేంజ్ లో ఉండబోతుందని టాక్.