Hari Hara Veeramallu : టాలీవుడ్ పోలవరం ప్రాజెక్ట్ గా పిలవబడిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం ఎట్టకేలకు రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇన్ని రోజుల నుండి ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నాన్ స్టాప్ వస్తాయి, ఈ నెల 30న కానీ, లేదా జూన్ 12 న కానీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఇది జరుగుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూసారు. మా అభిమాన హీరో సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి మేమెందుకు ఆన్లైన్ లో ఉండాలి అంటూ ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేక మంది మళ్ళీ సోషల్ మీడియా లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గత రెండు మూడు రోజులుగా పవన్ ఫ్యాన్స్ హడావుడి మామూలు రేంజ్ లో లేదు.
Also Read : అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీం మౌనం..అసలు ఏమి జరుగుతుంది?
కానీ ఎప్పుడైతే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయో, అప్పటి నుండి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రావాల్సినవి హోల్డ్ లో పడ్డాయి. రీసెంట్ గానే ఆ చిత్ర నిర్మాత AM రత్నం ముంబై లోని అమెజాన్ ప్రైమ్ ఆఫీస్ కి వెళ్లి, సినిమా విడుదల తేదీ విషయం లో చర్చలు కూడా జరిపాడట. విడుదల తేదీ కూడా ఖరారైంది, కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అప్డేట్ ని హోల్డ్ లో పెట్టమని చెప్పడం తో, నిన్న సాయంత్రం ప్రకటించాల్సిన విడుదల తేదీ ప్రకటన వాయిదా పడింది. మళ్ళీ పరిస్థితులు చెక్కబడిన తర్వాతే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. IPL సీజన్ ని కూడా రద్దు చేస్తున్నట్టు కాసేపటి క్రితమే BCCI సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరో పక్క తమిళ హీరో కమల్ హాసన్ కూడా ఈ నెల 16న జరగాల్సిన ‘తుగ్ లైఫ్’ మూవీ ఆడియో ఫంక్షన్ ని రద్దు చేసాడు.
ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ అప్డేట్ కూడా ఇలాగే ఆగిపోయింది. జూన్ 12 న విడుదల చేయాలనీ నిర్మాత AM రత్నం అధికారికంగా ఖరారు చేసాడు. బయ్యర్స్ కి కూడా ఈ సమాచారం అందించాడు. ఒకవేళ 12న విడుదల చేసే అవకాశమే ఉంటే ప్రొమోషన్స్ కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఉదాహరణకు కమల్ హాసన్ ‘తుగ్ లైఫ్’ చిత్రం జూన్ 5 న విడుదల కాబోతుంది. ఆడియో రిలీజ్ ని అయితే వాయిదా వేసాడు కానీ, సినిమా ని మాత్రం వాయిదా వేయలేదు, సమాంతరంగా నేటి నుండి ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడు. కొన్ని ఇంటర్వ్యూస్ కి సంబంధించిన ప్రోమోస్ కూడా విడుదలయ్యాయి. అలా ‘హరి హర వీరమల్లు’ టీం కూడా ప్రొమోషన్స్ మొదలు పెట్టొచ్చు కదా అని అభిమానుల నుండి ఎదురు అవుతున్న డిమాండ్.
Also Read : హరి హర వీరమల్లు’ కి హాలీవుడ్ హీరో ‘టామ్ క్రూజ్’ గండం..ఇలా అయితే కష్టమే!