Hari Hara Veera Mallu 2nd Half: సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక మైన ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు సాగుతున్నాడు…మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మొదటి షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ జనాలు మాత్రం సినిమా చూడ్డానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరి ఈ సినిమా విషయంలో ఇలా ఎందుకు జరిగింది అంటే క్రిష్ రాసుకున్న కథని ఆయన ఫస్టాఫ్ వరకు చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించారు. సనాతన ధర్మం అని ఒక పాయింట్ ను యాడ్ చేసి రీరైట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఈ సినిమాను క్రిష్ పూర్తిగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. అలా కాకుండా మధ్యలో క్రిష్ తప్పుకోవడంతో ఈ సినిమా గాడి తప్పింది. మరి అప్పటి నుంచే వీళ్ళందరికి సినిమా గాడి తప్పుతుంది అని తెలిసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన మేనియాతో సినిమా ఎలాగోలాగా నడిచేస్తుంది అనే ఉద్దేశ్యంతో తెరకెక్కించారు. మరి మొత్తానికైతే ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుడిని మెప్పించకపోవడంతో ఫస్టాఫ్ వరకు ఒకే కానీ, సెకండ్ హాఫ్ లో చాలా మైనస్ లు ఉన్నాయంటూ చాలామంది చాలా విమర్శలు అయితే చేస్తున్నారు.
Also Read: ఇంద్ర భవనాన్ని మించి.. ఎన్టీఆర్ కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదురుతాయి
ఇక సిజి వర్క్ విషయంలో మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది…నిజానికి క్రిష్ రాసుకున్న కథ ఏంటి అంటే ఔరంగజేబు నుంచి ఒక దొంగ ఎలా కోహినూర్ డైమండ్ ని దొంగలించాడు. అనేదే కథ కానీ ఇందులో మరొక కథ ఆడ్ అవ్వడం దానివల్ల క్రిష్ ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరొక ప్లాప్ ను అయితే తన ఖాతాలో వేసుకున్నాడంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఒక సినిమాని కథ ప్రకారం తెరకెక్కిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా అందులో కొన్ని అంశాలను కలగలిపి సినిమా కథకు సంబంధం లేకుండా ఆడ్ చేయడం వల్ల ఆ సినిమాకు ఉన్న ఫ్లేవర్ అయితే పోతుంది.
Also Read: ‘అజ్ఞాతవాసి’ ని మించిన డిజాస్టర్..’హరి హర వీరమల్లు’ 2వ రోజు వసూళ్లు ఎంతంటే
సినిమాను ఇద్దరు దర్శకులు కాకుండా క్రిష్ తన స్టైల్ లో మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు ముగ్గురు చేతులు పెట్టడం వల్ల సినిమా అటు ఇటు కాకుండా పోతుంది అనడానికి హరిహర వీరమల్లు సినిమాని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు…ఇక ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని ఎక్కువ డేట్స్ కేటాయిస్తే బాగుండేది…అలాగే సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది…