Hari Hara Veera Mallu Controversy: నెగిటివ్ టాక్ తో రెండో రోజే వసూళ్లను కోల్పోయిన హరి హర వీరమల్లు చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. చరిత్రను వక్రీకరించి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు తెరకెక్కించాడని ప్రముఖ సిపిఐ నేత ఆరోపించారు. ఆ వివాదం ఏమిటో చూద్దాం…
Also Read: ఇంద్ర భవనాన్ని మించి.. ఎన్టీఆర్ కొత్త ఇల్లు చూస్తే కళ్లు చెదురుతాయి
హరి హర వీరమల్లు పై మొదటి నుండి ఆరోపణలు ఉన్నాయి. ముదిరాజ్ కమ్యూనిటీ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని వీరమల్లు పాత్ర తలపిస్తుందని ఆరోపణలు చేశారు. అయితే ఇది పూర్తిగా కల్పిత గాథ. సాయన్న జీవితంతో ఎలాంటి సంబంధం లేదని హరి హర వీరమల్లు యూనిట్ వివరణ ఇచ్చారు. ఇక హరి హర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. నిజ జీవిత పాత్రలైన ఔరంగజేబు, వీరమల్లు చుట్టూ అల్లారు. ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని వీరమల్లు తెచ్చే ప్రయత్నమే హరి హర వీరమల్లు మూవీ మూలాంశం.
ఈ కథకు హిందువులపై ముస్లిం రాజుల అరాచకాలు, జిజియా పన్ను, సనాతన ధర్మం ఆపాదించారు. ఔరంగజేబు అకృత్యాల గురించి మాట్లాడితే తప్పేంటి? అనేది పవన్ కళ్యాణ్ వాదన. అయితే మొఘల్ రాజులలో ఔరంగజేబు చెడ్డవాడు అనే చరిత్ర చెబుతుంది. అదే సమయంలో అక్బర్ ని పరిపాలనాదక్షుడిగా, మతసామరస్యం పాటించిన వాడిగా అభివర్ణించారు. హరి హర వీరమల్లు వంటి చిత్రాలు రాజకీయ పార్టీల ప్రాపగాండా లో భాగంగా వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
పలువురు సెక్యులర్ వాదులు హరి హర వీరమల్లు చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీసి, హిందూ-ముస్లింల మధ్య మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇదే విషయాన్ని లేవనెత్తారు. 1618లో జన్మించిన ఔరంగజేబు 1687లో గోల్కొండ మీద దండయాత్ర చేశాడని చరిత్ర చెబుతుంది. అంతకు 200 సంవత్సరాల పూర్వమే మరణించిన వీరమల్లు.. ఔరంగజేబుతో యుద్ధం చేయడం ఏమిటని పవన్ కళ్యాణ్ ని రామకృష్ణ ప్రశ్నించారు.
బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రాన్ని మలిచిన తీరు విచారకరం. ఈ చిత్రం హిందూ ముస్లింలలో అపోహలు రాజేస్తోందని విమర్శించారు. అసలు హరి హర వీరమల్లు కథలో మూలమైన కోహినూర్ వజ్రం చరిత్ర గమనిస్తే.. ఆంధ్ర ప్రాంతం కొల్లూరులో దొరికిన అరుదైన వజ్రం మొదట అల్లావుద్దీన్ ఖిల్జీ వద్దకు చేరింది. 38.2 గ్రాముల బరువైన ఈ వజ్రాన్ని 16వ దశాబ్దంలో బాబర్ దక్కించుకున్నాడు.
Also Read: ‘అజ్ఞాతవాసి’ ని మించిన డిజాస్టర్..’హరి హర వీరమల్లు’ 2వ రోజు వసూళ్లు ఎంతంటే
వందల ఏళ్ళు మొఘలుల వద్దే ఆ వజ్రం ఉంది. మొఘల్ సామ్రాజ్యం పతనావస్థలో ఉండగా నాదిర్ షా దండయాత్ర చేసి వశం చేసుకున్నాడు. దానికి ఆయన కోహ్-ఇ-నూర్ అని నామకరణం చేశాడు. అంటే కాంతి శిఖరం అని అర్థం. ఇండియా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళాక క్వీన్ ఎలిజిబెత్ వద్దకు కోహినూర్ చేరింది. ఇండిపెండెన్స్ వచ్చాక, భారత ప్రభుత్వం కోహినూర్ తమకు తిరిగి ఇవ్వాలని పలుమార్లు ప్రతిపాదనలు చేసింది. బ్రిటన్ అందుకు ఒప్పుకోలేదు. కోహినూర్ ప్రస్తుతం బ్రిటన్ లోనే ఉంది.