Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) విడుదల తేదీని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. చేతిలో కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ నిల్చున్న ఫోటో తో ఈ తేదీని ప్రకటించారు. ఆ ఫోటో వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చాలా గ్రాండ్ గా ఉందని, ఇంత క్వాలిటీ తో ఉంటుందని ఊహించలేదని, కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి వేరే షాట్ ని వాడి ఉంటే చాలా బాగుండేదని అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ ఫోజు చూసేందుకు చాలా సాధారణంగా అనిపిస్తుంది. అంతే కాకుండా తల పవన్ కళ్యాణ్ ది, శరీరం వేరే వాళ్ళది అన్నట్టుగా ఈ పోస్టర్ ఉందని అభిమానులు కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్ ఎలా ఉన్నా చివరికి విడుదల తేదీని లాక్ చేసినందుకు అభిమానులు ఎంతో సంతోషంతో ఉన్నారు.
Also Read : ‘పుష్ప 2’ మేకర్స్ చేతుల్లోకి ‘హరి హర వీరమల్లు’..ఇక ఫ్యాన్స్ కి ప్రతిరోజు పండగే!
సరిగ్గా స్కూల్స్ రీ ఓపెనింగ్ రోజున ఈ చిత్రం విడుదల అవుతుంది. అదే రోజున కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ పధకాలను కూడా ప్రారంభించబోతున్నారు. సెలవు దినాలు ప్రత్యేకంగా ఏమి లేవు, వీకెండ్స్ తప్ప, కానీ ఏ ఇండస్ట్రీ లో కూడా ఈ చిత్రానికి పోటీ లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్ అనొచ్చు. ఇష్టమొచ్చినన్ని షోస్ వేసుకోవచ్చు, అభిమానులు కోరుకునే రికార్డు గ్రాస్ వసూళ్లు కూడా వస్తాయి. పవన్ కళ్యాణ్ గత మూడు చిత్రాలకు బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్, స్పెషల్ షోస్ వంటివి లేవు. ఓపెనింగ్స్ లో ఆయన విశ్వరూపం చూసి 8 ఏళ్ళు కావొస్తుంది. ఈ సినిమాకు అన్ని కలిసొచ్చాయి. ఈసారి నాన్ రాజమౌళి రికార్డ్స్ కాదు, ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ ని పెడతామంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.
మరో పక్క ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల చివరి వారం లో విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ విడుదల అయిన తర్వాతనే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టబోతున్నారట మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుండే మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ డబ్బింగ్ వర్క్, ఇరాన్ నుండి రావాల్సిన కొన్ని VFX షాట్స్ తప్ప, సినిమా మొత్తం పూర్తి అయిపోయిందని, ఈ నెల 30 వ తారీఖు లోపు మొదటి కాపీ ని సిద్ధం చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. జూన్ 3 న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన వరల్డ్ వైడ్ బయ్యర్స్ లిస్ట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అంతేకాకుండా సోమవారం రోజున నిర్మాత AM రత్నం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నాడట.
GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️
Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025!
The battle for Dharma begins… ⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/3KKNcspFIr
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025