Hari Hara Veeramallu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu)సినిమా షూట్ ని కంప్లీట్ చేశాడు. ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపద్యంలో ఈ సినిమా మీద యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తుంటే దర్శకుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) సైతం ఈ సినిమా సక్సెస్ అయితే తనకు ఒక మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులను మినహాయిస్తే సగటు ప్రేక్షకులలో ఏమాత్రం బజ్ అయితే లేదు.
Also Read : ప్రళయకాల రుద్రుడి అసుర హననం’..హరి హర వీరమల్లు మూడవ పాట వచ్చేస్తుంది!
మరి ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో రాబోతున్నాయి. తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఎంత వసూళ్లను రాబడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హరిహర వీరమల్లు సినిమాకి 150 కోట్ల వరకు బడ్జెట్ అయితే కేటాయించినట్టుగా తెలుస్తోంది. మరి ఆ బడ్జెట్ మొత్తాన్ని ఈ సినిమా రికవరీ చేయగలుగుతుందా? పవన్ కళ్యాణ్ వరకే పరిమితమవుతుందా..? మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ప్రేక్షకులను సైతం అలరిస్తాడా? పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేసి,
ఈ సినిమాకి భారీ రేంజ్ లో కలెక్షన్లు తెప్పించగలుగుతాడా? లేదంటే ప్రొడ్యూసర్ నష్టపోవాల్సిందేనా? అనే చాలా రకాల ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి విజయాలను సాధించినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం కథ కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్లను సాధించలేకపోతున్నాడు కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని మరోసారి ఆయన లైమ్ లైట్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఖరారు..ఎవరో ఊహించగలరా?