Game Changer Movie : ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం డైరెక్టర్ శంకర్(Shankar Shanmugham) నిర్లక్ష్యానికి పరాకాష్ట గా నిల్చిన ప్రోడక్ట్ గా అభిమానుల ముందుకొచ్చి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులు గేమ్ చేంజర్ ని ఒక పీడకల గా భావించే పరిస్థితి ని కలిగించింది ఈ సంక్రాంతి. ఒక్కమాట లో చెప్పాలంటే డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కెరీర్ తో ఆడుకునే ప్రయత్నం చేసాడు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మెదడుకి ఏది తోచితే అది చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన పనితీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నిందో ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేసిన శామీర్ మొహమ్మద్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి రక్తం మరిగేలా చేస్తుంది.
Also Read : హరి హర వీరమల్లు’ కోసం కోట్లు ఖర్చు చేసిన మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్!
ఆయన మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్ చిత్రం కోసం నేను సుమారుగా ఏడాది పాటు పని చేసాను. ఆరు నెలలు పూర్తి అయ్యాక మరో నెల రోజులు ఈ సినిమాకోసం పని చేయాల్సి ఉంటుందని మూవీ టీం నాతో చెప్పింది. నేను ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు ఈ సినిమా నిడివి 7 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఉన్నింది. దానిని నేను ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేసి 3 గంటల 30 నిమిషాలకు కుదించాను. ఆ తర్వాత మరో కొత్త ఎడిటర్ వచ్చి ఈ చిత్రాన్ని రెండున్నర గంటల నుండి మూడు గంటలకు కుదించాడు. డైరెక్టర్ శంకర్ ఎడిటింగ్ కోసం ఒక తేదీని నిర్ణయించేవాడు. కానీ ఆ తేదికి ఆయన వచ్చేవాడు కాదు, పది రోజులు ఆలస్యంగా వచ్చేవాడు. ఇదే పద్దతి చాలా రోజులు సాగింది. దీంతో ఆరు నెలల్లో పూర్తి అవ్వాల్సిన నా వర్క్, 300 – 350 రోజుల వరకు పొడిగింపబడింది. ఇక భరించడం నా వల్ల అవ్వక ఆ చిత్రం నుండి తపిపంచుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు షమీర్.
7 గంటలకు పైగా సినిమా ఫుటేజీ వచ్చిందంటే, దాదాపుగా రెండు నుండి మూడు సినిమాల రేంజ్ ఫుటేజ్ అన్నమాట. బౌండెడ్ స్క్రిప్ట్ ముందుగా సిద్ధం చేసుకొని ఉండుతూనే ఇంత నిడివి సినిమా వచ్చేది కాదు. అందుకే ఈ చిత్రం అతుకుల బొంతలాగా మారింది. స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉన్నింది కానీ, సన్నివేసాలకు మధ్య కనెక్షన్ అసలు కుదర్లేదు అనే రివ్యూస్ వచ్చాయి. అందుకు కారణం అర్థం పర్థం లేకుండా శంకర్ తీసిన 7 గంటల ఫుటేజీ కారణంగానే. దీనిని బట్టీ ఈ చిత్రాన్ని ఆయన ఎంత తేలికగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా క్రియేటివ్ ప్రాసెస్ లో ఫెయిల్ అవ్వడం సహజమే, ఎదో ఒక సమయంలో ఆ ఫెయిల్యూర్ ని మర్చిపోయి ముందుకు వెళ్లొచ్చు, కానీ ఇలాంటి తప్పిదాల కారణంగా ఫెయిల్యూర్స్ వస్తే భరించడం కష్టమే.