Hari Hara Veeramallu in Andhra : తమ అభిమాన హీరో సినిమాని మొదటి ఆట చూడాలని ప్రతీ హీరో అభిమానికి ఉంటుంది. ముఖ్యంగా సూపర్ స్టార్స్ అభిమానులు మొదటి రోజు మొదటి ఆట చూడకుంటే అసలు నిద్ర కూడా పోలేరు. ఆ రేంజ్ వీరాభిమానం ఉంటుంది. గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఇలాంటి బెనిఫిట్ షోస్ కి బాగా దూరమయ్యారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన చేతుల్లోనే సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఉంది. ఇక తిరుగేలేదని ఇష్టమొచ్చినట్టు ఆంధ్ర ప్రదేశ్ లో షోస్ ఏసుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాల కారణంగా పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు.
సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి ఇక నుండి వచ్చిన గ్రాస్ వసూళ్ళలో లాభాలు కావాలని, లేకపోతే థియేటర్స్ ని మూసి వేస్తామంటూ నిర్మాతలు మరియు బయ్యర్స్ మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే ఇవన్నీ జరగడం తో పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇండస్ట్రీ కి ఎంతో మేలు చేయాలనీ, వాళ్ళ గౌరవ మర్యాదలు తగ్గించకూడదని నేను తాపత్రయం పడుతుంటే నా సినిమా కి వెన్నుపోటు పొడవాలని చూస్తారా?, రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది, ఇక నుండి సినీ నిర్మాతలు నేరుగా ప్రభుత్వాన్ని కలవడానికి వీలు లేదు, ఫిలిం ఛాంబర్ ద్వారానే సంప్రదించాలి, నా సినిమాకు టికెట్ రేట్స్ కావాలన్నా ఫిలిం ఛాంబర్ ద్వారానే పనులు జరగాలి అంటూ ఆయన సంచలన ఆదేశాలు జారీ చేసాడు. ఈ క్రమంలోనే ఆయన తీసుకున్న మరో సంచలన నిర్ణయం 1 గంట షోస్ ని ఇక మీదట బ్యాన్ చెయ్యాలి అని.
ఇది తన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా నుండే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఈ వార్త నిన్న సోషల్ మీడియా లో లీక్ అవ్వడంతో అభిమానులు ఆవేశం తో ఊగిపోయారు. దీనికి మేము అసలు ఒప్పుకోము అంటూ గొడవ చేశారు. 7 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా బెనిఫిట్ షోస్ చూసే అదృష్టం కలగబోతుంది అని మేమంతా భావిస్తే ఇలాంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దారుణమని అభిమానులు పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి దుయ్యబట్టారు. అభిమానుల నిరసన పవన్ వరకు చేరే ఉంటుంది, మరి ఆయన తుది నిర్ణయం ఏంటో చూడాలని అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకుంటే నిర్మాతలు 4 గంటల షోస్ తో మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈ షోస్ కి టికెట్ రేట్స్ 900 రూపాయిలు పెట్టాలని చూస్తున్నారట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Also Read : టికెట్ రేట్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..ఫోటోలు వైరల్!