Hari Hara Veeramallu fans unhappy : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు.ఈ సినిమాని జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ గతంలో అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రావడం లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఎప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక అఫీషియల్ డేట్ ఇంకా అనౌన్స్ చేయనప్పటికి హరిహర వీరమల్లు సినిమా ఎందుకని ఇంత డిలే చేస్తున్నారు.
అనుకున్న సమయానికి రిలీజ్ చేయొచ్చు కదా ఎందుకని ఇలా రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నారు అంటూ అభిమానులు సైతం హరిహర వీరమల్లు సినిమా మేకర్స్ మీద కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులైతే భారీ ఆశలు పెట్టుకున్నారు.
దానికి తగ్గట్టుగా వీళ్ళు సరైన సమయానికి సినిమాని రిలీజ్ చేస్తే సినిమా మీద భారీ బజ్ ఉండి కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తాయి అలా కాకుండా ఇష్టమైన డేట్ ని అనౌన్స్ చేస్తూ ఆ డేట్ కి సినిమాని రిలీజ్ చేయక చాలా ఇబ్బందులను పడుతూ ఎందుకని ఇలా సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. తద్వారా అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటూ వాళ్ళు కొంతవరకు ఫైర్ అవుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ఆ రిలీజ్ డేట్ కి రావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ఉన్నారు.
Also Read : మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా తొందరగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే మరింత లేట్ అవుతుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మిగతా సినిమా షూటింగ్స్ అన్నింటిని పూర్తిచేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి వీలైనంత తొందరగా ఆయన నుంచి మరికొన్ని సినిమాలు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…