‘Hari Hara Veeramallu’ dialogue teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు’..ప్రముఖ దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు..మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జానర్ లో నటిస్తుండడం తో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా థ్రిల్ కి గురయ్యారు..కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నారు.

పవర్ స్టార్ తో ఖుషి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన AM రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..భారీ భారీ సెట్స్ తో సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు..కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు..ఇక ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పని చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరుకు రామోజీ ఫిలిం సిటీ లో భారీ తారాగణం తో సుమారు 40 రోజుల పాటు ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాన్ని తెరకెక్కించారు..ఇప్పుడు త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో మిగిలిన షూటింగ్ చెయ్యబోతున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదల అవ్వగా వాటికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ‘హరి హర వీరమల్లు’ కి సంబంధించిన మెయిన్ డైలాగ్ టీజర్ ని విడుదల చేయబోతున్నారట..డిసెంబర్ 31 వ తారీఖున ఘనంగా రీ రిలీజ్ అవ్వబోతున్న ఖుషి మూవీ కి ఈ టీజర్ ని అటాచ్ చేస్తారట..ఈ కొత్త టీజర్ తో పాటుగా ఇప్పటి వరుకు విడుదల చేసిన రెండు గ్లిమ్స్ వీడియోస్ ని కూడా జతపరుస్తారట..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 25 వ తారీఖున క్రిస్మస్ సందర్భంగా అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచెయ్యబోతుందట మూవీ టీం.