HariHaraVeeramallu Deleted Scenes : భారీ అంచనాల నడుమ విడుదలై ప్రీమియర్ షోస్ నుండే అభిమానుల నుండి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). అసలే పాతబడిన సినిమా అని జనాల్లో ఈ చిత్రం పై అంచనాలే ఉండేవి కాదు. దానికి తోడు లెక్కలేనన్ని నెగటివ్ ప్రచారాలు విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగాయి. ప్రీమియర్స్ పడే రోజు వరకు కూడా అసలు ఈ సినిమా విడుదల అవుతుంది అనే నమ్మకం ఎవరిలోనూ లేదు. అలాంటి సందిగ్ద పరిస్థితుల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాలి, లేదంటే సినిమా మసి అయిపోతుందని అభిమానుల్లో మొదటి నుండి ఉన్న భయం. చివరికి ఆ భయమే నిజమైంది. 700 , 800 రూపాయిలు పెట్టి థియేటర్స్ కి వెళ్లిన ఫ్యాన్స్ ఘోరమైన నెగటివ్ టాక్ చెప్పారు.
వాళ్ళు అలా నెగటివ్ టాక్ చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వరకు అభిమానులు సోషల్ మీడియా లో ఊగిపోయారు. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు, ఫస్ట్ హాఫ్ రేంజ్ సెకండ్ హాఫ్ కూడా ఉంటే సినిమా సూపర్ హిట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ ని డైరెక్టర్ అడుగడుగునా అస్సాం నగరానికి సినిమాని నడిపించాడు. ఒక్కటంటే ఒక్క ఎలేవేషన్ సీన్ పండలేదు, దానికి తోడు కళ్ళు చెదిరిపోయే రేంజ్ చీప్ గ్రాఫిక్ సన్నివేశాలు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆ గ్రాఫిక్ సన్నివేశాలు చూసి థియేటర్స్ లో నవ్వుకునే స్థితికి వచ్చేసింది. సోషల్ మీడియా నుండి అందుకున్న ఈ రివ్యూస్ ని మేకర్స్ బాగా గమనించారు. వెంటనే ట్రోల్ కి గురి కాబడిన సన్నివేశాలను తొలగించేసారు. యాగం సన్నివేశం లో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి బాణం వేసే సన్నివేశం దగ్గరలో ప్రీమియర్స్ షోస్ సమయంలో పవన్ కళ్యాణ్ కార్టూన్ వస్తుంది.
కానీ ఇప్పుడు ఆ సన్నివేశం ఉన్న చోట సూర్యుడి కాంతి తో కవర్ చేశారు. అదే విధంగా కార్టూన్ తో పవన్ కళ్యాణ్ జెండాని పాతే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సన్నివేశం కూడా వేరే లెవెల్ ట్రోల్ కి గురైంది. మేకర్స్ ఆ సన్నివేశాన్ని ఇప్పుడు తొలగించేసారు. అదే విధంగా సినిమాకి అది పెద్ద మైనస్ గా మారిన సన్నివేశం ఏదైనా ఉందా అంటే, అది క్లైమాక్స్ సన్నివేశం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఔరంగజేబు వద్దకు వస్తున్నప్పుడు ఎక్కడి నుండో ఒక ప్రళయం వచ్చేస్తుంది. ఆ తర్వాత సుడిగుండాల్లో కొట్టుకుంటూ వచ్చి ఔరంగజేబు చెయ్యి పట్టుకొని ఆయన్ని కాపాడుతాడు. అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది గుర్తుందా?, ఇప్పుడు ఆ సన్నివేశాన్ని పూర్తిగా కట్ చేశారు. ఆంధీ వచ్చేసింది వద్ద సినిమాని ముగించేశారు. ఇదే ఈ సినిమాలో చేసిన మార్పులు చేర్పులు, ఇవి చేసిన తర్వాత మూవీ కి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ అంటున్నారు.