Hari Hara Veeramallu : టాలీవుడ్ లో పండగ సీజన్ అతి త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు కరువు అయిన నేపథ్యం లో టాలీవుడ్ దాదాపుగా సంక్షోభం లోకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాలే ఇండస్ట్రీ ని కాపాడుతున్నాయి. కానీ చిన్న సినిమాల పరిమితి కేవలం వీకెండ్ వరకే ఉంటుంది. ఆ తర్వాత భారీ వసూళ్లు నమోదు అవ్వడం కష్టం. కానీ పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే ఎలా ఉంటుందో గత ఏడాది ‘దేవర’, ‘పుష్ప 2’ విషయం లో చూసాము. మూతపడిన థియేటర్స్ ని కూడా మళ్ళీ ప్రారంభించి ఈ చిత్రాలను నెలల తరబడి ప్రదర్శించారు. ఈ ఏడాది ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల మధ్య విడుదలై మిస్ ఫైర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు బయ్యర్స్ చూపు కేవలం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) చిత్రం మీద మాత్రమే ఉంది.
Also Read : ‘పుష్ప 2’ మేకర్స్ చేతుల్లోకి ‘హరి హర వీరమల్లు’..ఇక ఫ్యాన్స్ కి ప్రతిరోజు పండగే!
దాదాపుగా ఐదేళ్ల పాటు సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఎన్నో అవాంతరాలను ఎగురుకుంటూ ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నిన్న మొన్నటి వరకు విడుదల తేదీపై సస్పెన్స్ మైంటైన్ చేసిన నిర్మాతలు, నిన్న జూన్ 12న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. దాదాపుగా మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా, ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని వెండితెర మీద చూసే అదృష్టం కలగబోతుంది అంటూ అభిమానులు సంతోషిస్తున్నారు. సినిమా మీద అభిమానులకు బలమైన నమ్మకం ఉంది కానీ, ఇంత మంచి కంటెంట్ సినిమాకు ప్రొమోషన్స్ సరిగా చేయట్లేదని అభిమానుల్లో చిన్నపాటి అసహనం ఉండేది. కానీ మేకర్స్ రెడీ చేస్తున్న ప్రొమోషన్స్ ని చూసి ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
బుర్జ్ ఖలీఫా(Burj Khalifa) మీ అందరికీ అవహగానా ఉండే ఉంటుంది. దుబాయ్ లో అత్యంత ఎత్తైన టవర్స్ ఇది. వీక్షించుకులు ఈ టవర్స్ ని చూసేందుకు నాలుగు వేల రూపాయలకు పైగా వెచ్చిస్తూ ఉంటారు. బాలీవుడ్ లో పలు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్స్ , ట్రైలర్స్, మరియు కొన్ని ప్రతిష్టాత్మక ఈవెంట్స్ ని ఈ బుర్జ్ ఖలీఫా పై ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతుంది. ఈ బుర్జ్ ఖలీఫా పై ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ని ప్రదర్శించే ప్లాన్ లో ఉన్నాడట నిర్మాత AM రత్నం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అమెరికా లో టైమ్స్ స్క్వేర్ స్క్రీన్ లో కూడా ఈ ట్రైలర్ ని ప్రదర్శించబోతున్నారట. ఈ నెల 21 న నిర్మాత నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో ఈ విషయాలను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ నుండి పోరాట సన్నివేశాలు లీక్..ఫోటోలు వైరల్!