Hari Hara Veeramallu Budget Truth: ఆరేళ్ళ క్రితం మొదలై, ఎన్నో కష్టాలను ఎదురుకొని, షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, విడుదల సమయం లో కూడా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదురుకుంటూ నిర్మాత AM రత్నం ఈ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమాని విడుదల చేశాడు. ఆయన లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ఖర్చు అయిన బడ్జెట్ 200 కోట్ల రూపాయిల పైమాటే. సినిమా ఇండస్ట్రీ నుండి కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఒక నిర్మాత, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయడమే పెద్ద ఒత్తిడి తో కూడుకున్న విషయం. అలాంటిది 200 కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాని ఆరేళ్ళు ఆలస్యం చేసినా తన భుజాలపై మోస్తూ కనిపించాడు. అంటూ మీడియా లో పెద్ద ఎత్తున ఫోకస్ అయ్యింది. ఇవన్నీ కాకుండా AM రత్నం పాత సినిమాల బ్యాలన్స్ డబ్బులు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ ఏళ్ళ తరబడి ఇవ్వకుండా అలాగే ఉండిపోయాడట.
Also Read: ‘ఓజీ’ వెర్సస్ ‘కూలీ’..గెలిచింది ఎవరంటే!
మరో పక్క సినిమా సెకండ్ హాఫ్ బాగా రాలేదనే విషయం ఇండస్ట్రీ వర్గాల్లో లీక్ అయ్యింది. దీంతో బయ్యర్స్ నిర్మాత AM రత్నం అడిగిన ఫాన్సీ రేట్స్ ఇవ్వలేకపోయారు. ఇక చివరికి పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగి,AM రత్నం పాత బకాయిలను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ద్వారా క్లియర్ చేసి సినిమాని విడుదల చేయించాడు. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి పవన్ కళ్యాణ్ నిర్మాత AM రత్నం కారణంగా 70 కోట్ల రూపాయిల అప్పు అయ్యాడు. ఈ చిత్రానికి ఆయన ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకపోగా, తిరిగి ఆయనకే 70 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక్కడ అందరూ నిర్మాత AM రత్నం బాగా నష్టపోయాడనే అనుకుంటూ ఉన్నారు. కానీ అసలు నష్టపోయినది పవన్ కళ్యాణ్ మాత్రమే అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. 200 కోట్లు ఖర్చు చేసాను అంటూ డప్పుకొట్టుకున్న AM రత్నం, అసలు ఈ చిత్రానికి నిజంగా ఎంత బడ్జెట్ ని ఖర్చు చేశాడు అనే అంశం పై సోషల్ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది.
Also Read: దయచేసి చూడండి..పవన్ కళ్యాణ్ ని సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను – అల్లు అరవింద్
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆయన ఖర్చు చేసిందే 70 కోట్ల రూపాయిలు. మచిలీపట్టణం పోర్ట్ సెట్, రాజ దర్బారు సెట్, చార్మినార్ సెట్ తప్ప, మరొక సెట్ ఈ చిత్రం లో కనిపించలేదు. చార్మినార్ సెట్ కి రెండు కోట్లు అయ్యిందని స్వయంగా ఆయనే చెప్పాడు. ఇక మిగిలిన సెట్స్ మరియు తారాగణం రెమ్యూనరేషన్స్ అన్ని లెక్కగడితే 70 కోట్లకు మించి అవ్వదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అమరావతి లో ఒక చిన్న రేకుల షెడ్ లోనే షూటింగ్ చేశారు. ఇక గ్రాఫిక్స్ ఏ రేంజ్ వి ఉపయోగించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అలాంటప్పుడు 200 కోట్ల ఖర్చు ఎక్కడి నుండి అయ్యింది అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.