Wife Cheating Case: వారిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పైగా వారిద్దరి మధ్య దూరపు బంధుత్వం కూడా ఉంది. పెళ్లయిన కొద్ది రోజుల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు.. అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. ఇంతలోనే ఏమైందో తెలియదు.. ఆ భార్య ప్రవర్తన మారిపోయింది. నిత్యం చెవి దగ్గరే ఫోన్ ఉండడం మొదలైంది. కట్టుకున్న వాడిపై ప్రేమను కురిపించడం మానివేసింది. మొదట్లో దీనిని అంతగా పట్టించుకోని భర్త.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి గుండెల బాదుకున్నాడు. ఇదే విషయాన్ని భార్య తరపు వాళ్లకు చెప్పడంతో.. ఆమెను మందలించారు. బుద్ధిగా ఉండాలని సూచించారు.
Also Read: ఆ ఒక్క మాటతో సంఘ్ పరివార్ ను షేక్ చేసిన రేవంత్ రెడ్డి
తన కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ ఆమె ప్రవర్తన మారలేదు. పైగా మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టింది. భర్త ఇంట్లో లేనిది చూడడం.. ఇంట్లోకి ప్రియుడిని పిలిపించుకోవడం.. అతనితో సరసాలలో మునిగి తేలడం పరిపాటిగా మార్చుకుంది. ఇదే విషయాన్ని ఆ భర్తకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో అతడు ఆమెను మందలించాడు. “నేను పద్ధతి గానే ఉంటున్నాను. ఏ మాత్రం నా ప్రవర్తన అడ్డగోలుగా లేదు. నువ్వే అనవసరంగా అనుమానం పెంచుకొని ఇబ్బంది పడుతున్నావ్. నన్ను ఇబ్బంది పెడుతున్నావ్” అంటూ అతనిపై దబాయింపుకు దిగింది. దీంతో తనే మళ్ళీ మనసు మార్చుకొని అనవసరంగా భార్యను ఇబ్బంది పెడుతున్నానేమోనని భావించాడు. ఆ విషయాన్ని మర్చిపోయాడు.
Also Read: హరి హర వీరమల్లు’ బడ్జెట్ ఇంత తక్కువనా..? నిర్మాత పవన్ ని మోసం చేశాడా!
ఇక ఇటీవల అతడు పని ఉండగా వేరే ఊరికి వెళ్ళాడు. ఆరోజు అతను ఇంటికి రాలేదు. ఇదే అదునుగా ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.. అతనితో సరసాలలో మునిగి తేలుతోంది. ఈ విషయం తెలియని ఆ భర్త ఉదయాన్నే ఇంటికి రావడంతో.. ఇంటికి తలుపు వేసి ఉంది. ఎంత కొట్టినా సరే భార్య తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. కిటికీ నుంచి అతడు చూడగా వారిద్దరు సరసాలలో మునిగి తేలుతున్నారు. దీంతో బయట గడియ పెట్టి.. ఆమె కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు.. వారంతా వచ్చి వారిద్దరిని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. దేహ శుద్ధి చేశారు. ఈ సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం నాయకుని తండాలో చోటుచేసుకుంది. ఆ వివాహిత పేరు సరళ (పేరు మార్చాం), ఆమె సంబంధం పెట్టుకున్న వ్యక్తి పేరు రమేష్.. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు సంఘటన స్థలానికి వచ్చి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.