Hari Hara Veeramallu : సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక్కడ సక్సెస్ అనేది కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. సక్సెస్ లో ఉన్న వాళ్లకు మాత్రమే ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. వాళ్లు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు తమ మనుగడను కొనసాగించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే స్టార్ హీరోలందరు సక్సెస్ ల వెనుక పరిగెడుతున్నారు. ఒక సక్సెస్ ఫుల్ దర్శకుడు ఉంటే చాలు అతనితో చాలావరకు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan kalyan) మొదటి స్థానం లో ఉండటం విశేషం… ఆయన పేరు చెబితే చాలు యూత్ మొత్తం ఊగిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ఇంతకుముందు సెట్స్ మీద ఉంచిన సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాకి సంబంధించిన షట్ ను గత రెండు నెలల క్రితం ఆయన కంప్లీట్ చేసాడు.
ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే శరవేగంగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులందరు అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నప్పటికి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ భారీగా ఉండటం వల్ల ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడుతుంది అని ధోరణిలోనే ఇప్పుడు కొన్ని కీలకమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…
Also Read: ఆంధ్రజ్యోతిలో స్ట్రింగర్ లాగా పని చేసిన వంశీ మహా న్యూస్ ఛానెల్ ఓనర్ ఎలా అయ్యాడు?
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ సినిమాతో తనను తాను పాన్ ఇండియా హీరోగా రిప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల బడ్జెట్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు కలెక్షన్స్ ను రాబడుతుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది.
ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు. కానీ నెగెటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం సినిమా 150 కోట్లకు మించి కలెక్షన్స్ ను అయితే రాబట్టదు…ఇక 250 కోట్లకు మించి కలెక్షన్స్ వచ్చినప్పుడే ఈ సినిమా హిట్ అయినట్టుగా ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా మరొక 20 రోజుల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏ రేంజ్ లో కలెక్షన్ రాబడుతుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది…