HHVM 5 Days Collections: భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం కాస్త ప్రీమియర్ షోస్ నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణం చేత సినిమా కలెక్షన్స్ పై రెండవ రోజు భారీగా పడింది. మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మార్కుని అవలీల గా అందుకోవాల్సిన ఈ సినిమా, కేవలం 70 కోట్ల రూపాయిల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ స్థాయికి ఇది చాలా అంటే చాలా తక్కువ, చిల్లర అనుకోండి. మొదటి రెండు రోజుల సంగతి కాసేపు పక్కన పెడితే , మూడవ రోజు మాత్రం డీసెంట్ స్థాయి గ్రోత్ ని సంపాదించుకొని, నాల్గవ రోజున అన్ని సెంటర్స్ లో రఫ్ఫాడించేసింది. నాల్గవ రోజున ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి వచ్చిన షేర్స్ ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారేమో అని అంతా అనుకున్నారు.
Also Read: మహేష్ బాబు ‘హరి హర వీరమల్లు’ కథని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా!
కానీ 5 వ రోజు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు డీసెంట్ రేంజ్ అని అనిపించుకున్నా, మిగిలిన ప్రాంతాల్లో షేర్ రావడమే బాగా కష్టమైంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 5వ రోజున 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 50 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయట. టాక్ ఎలాగో బాగాలేదు కాబట్టి, ఇలాంటి వసూళ్లు వస్తాయని ముందుగా ఊహించిందే. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 5వ రోజున రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 5 రోజులకు కలిపి 67 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
Also Read: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను తిట్టిన ఆ స్టార్ హీరోనే ఇప్పుడు ఆయన మూవీలో విలన్ గా చేస్తున్నాడా..?
రెండవ రోజు వచ్చిన వసూళ్లను చూసి అసలు సినిమాకు ఫుల్ రన్ లో కనీసం వంద కోట్ల గ్రాస్ వసూళ్లు అయినా వస్తాయా అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 110 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో మరో 20 నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5 ఏళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న చిత్రం. ఎంతో ఘోరమైన నెగటివిటీ ని ఎదురుకున్న చిత్రం. విడుదలకు ముందు ఈ సినిమా చూసినన్ని దరిద్రాలు ఏ సినిమా చూసి ఉండదు. ఆడియన్స్ లో ఈ చిత్రం పై మొదటి నుండి నెగటివ్ అభిప్రాయం. అయినప్పటికీ కూడా ఇంత దూరం వరకు వసూళ్లు వచ్చాయంటే నిజంగా పవర్ స్టార్ స్టామినా వల్లనే అని అంటున్నారు నెటిజెన్స్.