Hari Hara Veera Mallu vs Ghaati : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) కష్టాల గురించి రాస్తే ఒక పెద్ద పుస్తకమే తయారు అవుతుంది. సినిమాలంటే ప్రాణం అనే విధంగా పని చేసే AM రత్నం కాబట్టి ఇలాంటి కష్టాలను తట్టుకొని నిలబడ్డాడు కానీ, వేరే ఏ నిర్మాత అయినా నా వల్ల కాదు బాబోయ్ అని పరుగులు పెట్టేవారు. అలా ఎన్నో కష్టనష్టాలను భరించి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. కానీ VFX వర్క్ సమయానికి పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు అయితే రాలేదు కానీ, తన బయ్యర్స్ అందరికీ ఇప్పటికే ఈ సినిమా 12 న రావడం లేదని నిర్మాత రత్నం సమాచారం అందించేసాడు. ఇప్పుడు ఈ సినిమా సరికొత్త విడుదల తేదీ పై చర్చలు నడుస్తున్నాయి.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జులై 4 న విడుదల చేయాలని చూస్తున్నారట. జులై 4న కాకపోతే జూన్ 26న అయినా ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే జులై 4న విడుదలైతే ఒక ఆసక్తికరంగా పోటీని ఆడియన్స్ చూడొచ్చు. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి అత్యధిక శాతం క్రిష్ దర్శకత్వము వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు వేరే కమిట్మెంట్ ఉండడం వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. అనుష్క(Anushka Shetty) ని ప్రధాన పాత్రలో పెట్టి ‘ఘాటీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 11 న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అంటే క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వం వహించిన రెండు సినిమాలు వారం గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి అన్నమాట.
Also Read : హరి హర వీరమల్లు’ లో హైలైట్ అయ్యే సన్నివేశాలు ఇవే..కానీ సెకండ్ హాఫ్ రిస్క్ ఉంది!
ఈ రెండు సినిమాల్లో కచ్చితంగా ‘హరి హర వీరమల్లు’ చిత్రానికే అత్యధిక క్రేజ్ ఉంటుంది. కానీ డైరెక్టర్ క్రిష్ పనితనం రెండు సినిమాలకు ఎంత వ్యత్యాసం ఉంది అనేది ఆడియన్స్ చూడబోతున్నారు. ‘ఘాటీ’ మూవీ టీజర్ లో అనుష్క ని ఎంత క్రూరంగా చూపించాడో మనమంతా చూసాము. క్రిష్ లో ఇంతటి వయొలెంట్ ఆలోచనలు కూడా ఉన్నాయా అని ఈ టీజర్ ని చూసిన తర్వాతనే అందరికీ అర్థమైంది. మరి సినిమా మొత్తం ఆమెని అలాగే చూపించాడా లేదా అనేది చూడాలి. అదే విధంగా ప్రమోషన్స్ లో కూడా ఆయన ఎక్కువగా ‘ఘాటీ’ చిత్రం పైన మాత్రమే ఫోకస్ పెట్టాడు. ‘హరి హర వీరమల్లు’ కి కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆయన పాల్గొంటాడట. ఇలా ఒకే డైరెక్టర్ నుండి రెండు సినిమాలు విడుదల అవ్వడం అనేది గతం లో బి.గోపాల్ విషయం లో జరిగింది. ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ఇంద్ర, అల్లరి రాముడు సినిమాలు వారమ్ గ్యాప్ లో విడుదలయ్యాయి. రెండిటి ఫలితాలు మన అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అలంటి ఘటనే రిపీట్ అయ్యింది, ఇప్పుడు ఏమి జరగబోతుందో చూడాలి.