Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) అనే పేరు తీస్తేనే సోషల్ మీడియా లో అభిమానులు కన్నీటి వరదని సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో 2021 వ సంవత్సరం లో మొదలైంది. ఆరంభం లో షూటింగ్ పరుగులు పెట్టింది కానీ, ఆ తర్వాత పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమాని ముందుగా మార్చ్ 28న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ అప్పటికి పని పూర్తి అయ్యే అవకాశం లేకపోవడం తో మే9 కి వాయిదా వేశారు. ఇప్పుడు మే9 న కూడా ఈ చిత్రం విడుదల అవ్వడం లేదు. గమ్మత్తు ఏమిటంటే, ఈ సినిమా మరోసారి వాయిదా పడింది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చినప్పుడు, మూవీ టీం వెంటనే స్పందించి మే9 న విడుదల చేస్తామని అధికారిక ప్రకటన ఒక కొత్త పోస్టర్ ద్వారా తెలియజేసారు.
ఈ పోస్టర్ రిలీజ్ చేసిన మరుసటి రోజునే ఈ సినిమా మే9 న విడుదల అవ్వడం లేదని బయ్యర్స్ అందరికీ సమాచారం వెళ్ళింది. ఆరోజు నుండి నేటి వరకు ఈ చిత్రం కొత్త విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) షూటింగ్ పూర్తి చేసేవరకు ఈసారి డేట్ ని ప్రకటించకూడదని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకే అటు వైపు నుండి ఎలాంటి సౌండ్ రావడం లేదు. మే మొదటి వారం లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తాడని టాక్ అయితే వచ్చింది కానీ, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. రీసెంట్ గానే ఇండియా వెర్సస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే వాతావరణం ఉన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మూడ్ ఎలా ఉందో అని డేట్స్ అడగడానికి కూడా భయపడుతున్నాడు నిర్మాత AM రత్నం. ఒకపక్క ఆయనకు నెల తిరిగే సరికి కోట్ల రూపాయలలో వడ్డీలు కట్టుకునే పరిస్థితి.
ఆ వడ్డీలు కట్టకపోతే , సినిమా పూర్తి చేయడానికి ఫైనాన్స్ కూడా ఇవ్వం అంటున్నారు. మరో పక్క ఆయన బయ్యర్స్ కి ఆకాశాన్ని అంటే రేట్స్ చెప్తున్నాడు. సీడెడ్ ని మినహాయించి, కేవలం ఆంధ్ర ప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ ని వంద కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తున్నాడట AM రత్నం. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సీక్వెల్ ‘పుష్ప 2’ కూడా ఈ రేంజ్ లో అమ్ముడుపోలేదు. దీంతో బయ్యర్స్ ఈ సినిమా వైపు కూడా ఇప్పట్లో చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే నిర్మాత చెప్తున్నా రేట్ కి, ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ట్రైలర్ కానీ, మేకింగ్ వీడియో కానీ వచ్చిన తర్వాతనే రైట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ మే మొదటి వారం లో డేట్స్ ఇస్తే జూన్ లో ఈ చిత్రం వస్తుందని, లేకపోతే జులై లో వస్తుందని అంటున్నారు.