Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఎప్పుడో 2021వ సంవత్సరంలో షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ సెట్స్ మీదనే ఉంది. ప్లాన్ ప్రకారం షూటింగ్ పూర్తి అయ్యుంటే ఈ నెల 28న విడుదల అయ్యేది. కానీ VFX వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడంతో పాటు, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వారం రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉండడం, ఆయన రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల ఆ డేట్స్ ని కేటాయించకపోవడం తో మే9 కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మే9 న విడుదల చేయడం కష్టమని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మొదటి వారం లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తానని నిర్మాతలకు చెప్పాడు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ , VFX వర్క్ క్లైమాక్స్ కి సంబంధించినది. ఆరు నెలలపాటు వర్క్ చేశారట. ఇంకా రెండు వారల వర్క్ బ్యాలన్స్ ఉందట. ఏప్రిల్ 15 లోపు ఆ వర్క్ పూర్తి అయితే కచ్చితంగా మే 9న వస్తుంది, లేదంటే ఆగష్టు వరకు ఆగాల్సిందే అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా ఏకముగా 11 సార్లు వాయిదా పడింది. ఇంకోక్కసారి వాయిదా పడితే అత్యధికసార్లు వాయిదా పడిన ఏకైక సినిమాగా, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో సరికొత్త రికార్డుని నెలకొల్పుతుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటించగా, బాబీ డియోల్(Bobby Deol), సునీల్, సుబ్బరాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటల్లో ‘కొల్లగొట్టినాదిరో’ పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ రెండవ వారం నుండి ప్రొమోషన్స్ నాన్ స్టాప్ గా చేస్తారని తెలుస్తుంది. ముందుగా మేకింగ్ వీడియో ని విడుదల చేస్తారట. ఆ తర్వాత మూడవ పాటని, మూడవ వారంలో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తారట. రెండవ వారం నుండి అభిమానులకు నాన్ స్టాప్ గా ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందని అంటున్నారు మేకర్స్.