Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) నుండి నేడు రెండవ పాట విడుదలైంది. ‘కొల్లగొట్టినాదిరో'(Kollagottinaadiro) అంటూ సాగిన ఈ పాట అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కానీ మామూలు ఆడియన్స్ కి మాత్రం పర్వాలేదు అనే రేంజ్ అనిపించొచ్చు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ చూసేందుకు చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ లుక్స్ కొన్ని షాట్స్ లో సూపర్ గా ఉన్నాయి కానీ, మరికొన్ని షాట్స్ లో మాత్రం డైరెక్టర్ సరిగా చూపించలేదు అనిపించింది. పాటలో సెట్ వర్క్ అదిరిపోయింది. నిర్మాత ఏఎం రత్నం ఖర్చు కి ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాని తెరకెక్కించాడని ఈ పాట ని చూసి అర్థం చేసుకోవచ్చు. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం చాలా బాగుంది. ప్రారంభం లో సింగర్ మంగ్లీ వాయిస్ లో కాస్త బేస్ తగ్గించి ఉండుంటే బాగుండేది అని అనిపించింది.
అభిమానులకు సర్ప్రైజ్ కి గురి చేసిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేయడం. ఆయన నుండి ఇలాంటి స్టెప్స్ చూసి అభిమానులు చాలా కాలం అయ్యింది. ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ లో డ్యాన్స్ వేసాడు కానీ, ఆ పాట ఎక్కువశాతం ట్రోల్ అయ్యింది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ ని అప్పట్లో అభిమానులంతా తిట్టారు. ఇప్పుడు అదే గణేష్ మాస్టర్ ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేసాడు. గతంలో వచ్చిన ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఈ పాటకి కొరియోగ్రఫీ చేసినట్టుగా అనిపించింది. అంతా బాగానే ఉంది కానీ, లిరికల్ వీడియో ఎడిటింగ్ వర్క్ బాగాలేదు. అంత మంచి గ్రాండియర్ సాంగ్ కి లిరికల్ వీడియో ఎడిటింగ్ కూడా కరెక్ట్ గా ఉండుంటే ఇంకా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది. కొన్ని షాట్స్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ మేకప్ కనిపించడం గమనార్హం.
ఇక చంద్రబోస్ అందించిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ పాట అభిమానులకు విజువల్ ఫీస్ట్, మామూలు ఆడియన్స్ కి యావరేజ్ రేంజ్ అనిపించొచ్చు. కానీ ఇలాంటి పాటలు ఇంస్టాగ్రామ్ రీల్స్ లో బాగా క్లిక్ అవుతూ ఉంటాయి. యూత్ ఆడియన్స్ ఈ పాట ని లాంగ్ రన్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట ‘మాట వినాలి’ కి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ పాటకు యూట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ నేడు విడుదలైన పాట మాత్రం మొదటి పాట కంటే మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ పాట భవిష్యత్తులో యూత్ ఆడియన్స్ ని ఎంతమేరకు ఆకర్షిస్తుంది అనేది.