Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా విడుదల అంటే బెనిఫిట్ షోస్, ఫ్యాన్స్ షోస్, స్పెషల్ షోస్ ఇలా ఒక్కటా రెండా ఎన్నో హంగులు ఆర్భాటాలు ఉండేవి. ఆయన అభిమానులు బెనిఫిట్ షోస్ చూసేందుకు వేల రూపాయిలు ఖర్చు చేస్తూ ఉండేవారు. కానీ గడిచిన ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇలాంటివి చూసే అదృష్టం దొరకలేదు. ఎందుకంటే మాజీ సీఎం జగన్ తెలుగు సినిమాకు విధించిన ఆంక్షలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలకు మినహా, మిగిలిన హీరోల సినిమాలకు టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ వంటి వారికి అనుమతిని ఇచ్చేవారు. ఆ కారణం చేత అభిమానులకు ఉన్న ఈ చిన్న ముచ్చట తీరలేదు. ఇప్పుడు వచ్చింది కూటమి ప్రభుత్వం. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రభుత్వం. ఇష్టమొచ్చిన సమయం లో, ఇష్టమొచ్చిన టికెట్ రేట్స్ మీద షోస్ ని నడుపుకోవచ్చు. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా జనసేన పార్టీ ఖాతాలోనే ఉండడం టికెట్ హైక్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
Also Read : కొత్త సినిమాలను డామినేట్ చేసిన ‘హిట్ 3’ 18 వ రోజు వసూళ్లు..ఎంత వచ్చిందంటే!
ఈ సినిమాని ఏప్రిల్ 11న రాత్రి 11: 59 నిమిషాలకు షోస్ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ వెయ్యి రూపాయిల వరకు ఉంటాయట. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో ఇదే రేట్స్ ఉంటాయా, లేకపోతే బి, సి సెంటర్స్ లో కాస్త తక్కువ రేట్స్ ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. 12 గంటల నుండి నాన్ స్టాప్ గా మొదటి రోజు 7 షోస్ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతీ థియేటర్ లో ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.
ఎందుకంటే ఎల్లుండి ఈ సినిమాలోని యుద్ధ ఘట్టం సమయం లో వచ్చే ఒక పాట అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) నుండి అభిమానులు ఎలాంటి కంటెంట్ ని అయితే కోరుకుంటున్నారో, ఆ కంటెంట్ ని ఇవ్వబోతున్నారట. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డీల్ నిన్నటితో పూర్తి అయ్యిందట. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుండి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టబోతున్నారు అనే దానిపై కూడా రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈ చిత్రం ఓవర్సీస్ లో గురువారం రోజున 12 గంటల ఆట నుండి షోస్ ప్రారంభం కానున్నాయి. ఓవర్సీస్, ఆంధ్ర ప్రదేశ్ సంగతి కాసేపు పక్కన పెడితే నైజాం లో ఈ చిత్రానికి టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.