Hari Hara Veera Mallu Controversy: తెలుగు చిత్ర పరిశ్రమలో( Telugu cinema industry ) మెగా కుటుంబానిది ప్రత్యేక స్థానం. విపరీతమైన అభిమాన గణం ఆ కుటుంబ సొంతం. అందుకే ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా.. వారికి అదే ప్రాధాన్యం దక్కుతోంది. వారంతా స్టార్ డం దక్కించుకుంటున్నారు. అయితే అంతటి అభిమానగణం సొంతం చేసుకున్న మెగా ఫ్యామిలీ చుట్టూ కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి నిలబడింది ఆ కుటుంబం. రాజకీయాల్లో కూడా ఇప్పుడు రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రాజ్యాధికారం సొంతం చేసుకునే క్రమంలో చతికిల పడ్డారు. అప్పుడు కూడా చిరంజీవి వెనుక భారీ కుట్ర నడిచింది. దీనిని తట్టుకోలేని ఆయన రాజకీయాలకు దండం పెట్టి తిరిగి సినిమాలు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రూపంలో ఆ కుటుంబానికి అరుదైన అవకాశం వచ్చింది. ఏపీలో రాజకీయంగా జనసేన కీలక స్థానానికి చేరుకుంది. అయితే ఇప్పటికీ మెగా కుటుంబం చుట్టూ కుట్ర జరుగుతూనే ఉంది. అయితే మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాజకీయ ప్రాధాన్యం దక్కడం వెనుక సినీ ఇమేజ్ ఉందన్నది ప్రత్యర్థుల ఆలోచన. అందుకే ఆ ఇమేజ్ను డామేజ్ చేసేందుకే తాజాగా హరిహర వీరమల్లు చుట్టూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
THIS IS WHAT HAPPEND TO THE #HARIHARAVEERAMALLU pic.twitter.com/6atjDAWcZ9
— CHITRAMBHALARE (@chitrambhalareI) July 29, 2025
సినిమాపై నెగిటివ్ ప్రచారం..
హరిహర వీరమల్లు( Harihara Veera Mallu) చిత్రం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతిగా ప్రవర్తించింది. ఆ సినిమాపై నెగిటివ్ టాక్ ప్రారంభమయ్యేలా సోషల్ మీడియాలో రెచ్చిపోయారు వైసిపి శ్రేణులు. ఎలాగైనా ఆ సినిమాను డిజాస్టర్ చేయాలన్నది ప్లాన్. తద్వారా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు డ్యామేజ్ వచ్చేలా చేయాలన్నది వారి ప్రణాళిక. ఈ క్రమంలో నేరుగా వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. అంబటి రాంబాబు లాంటి నేత సటైరికల్ గా పవన్ కళ్యాణ్ సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు. అదే రాంబాబు తర్వాత పవన్ కళ్యాణ్ మిగతా సినిమాలపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు సినీ పరిశ్రమలో ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. సినిమా టిక్కెట్ పెంపునకు ప్రత్యేక అనుమతులు పొందారని ఆక్షేపిస్తున్నారు. మిగతా సినిమాల మాదిరిగానే ప్రభుత్వ అనుమతులు పక్కా నిబంధనలతోనే పొందింది ఈ చిత్రం యూనిట్. కానీ కేవలం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ వల్లే టికెట్ల ధర పెంపునకు అనుమతి వచ్చిందని ప్రజల్లో తప్పుదోవ పట్టెలా ప్రచారం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే మొత్తానికి ఈ చిత్రం మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేక అభిమాన గణంతో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.
Also Read: ప్రభాస్ తో పూరి.. ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయమట.!
శ్రీకాకుళంలో ఓ వైసీపీ నేత కుట్ర..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ నేతలు నేరుగా రంగంలోకి దిగి సినిమాను డిజాస్టర్ చేయాలన్న ప్రయత్నం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఓ ధియేటర్లో షో మొత్తం టికెట్లను ఓ వైయస్సార్ కాంగ్రెస్ నేత కొనుగోలు చేశారు. సినిమాకు ఎనిమిది నుంచి 15 మంది వరకు ప్రేక్షకులను పంపించి.. వాటిని వీడియో తీశారు. మరోవైపు సెకండాఫ్ లో ఇలా నిద్రపోతున్నారంటూ ఒకరిద్దరి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంటే ఏ స్థాయిలో కుట్ర చేశారో అర్థం అవుతోంది. ఇంతకంటే దిగజారుడు మరొకటి ఉండదు. ఈ విషయంలో మెగా అభిమానులు ముందు నుంచి అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. పవన్ కళ్యాణ్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విపరీతమైన కోపంతో ఉన్నాయి. తమను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాదు.. భవిష్యత్తులో సైతం టిడిపి తో పొత్తు ఉంటుందని పవన్ తరచూ ప్రకటిస్తున్నారు. ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డామేజ్ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే హరిహర వీరమల్లు సినిమాను ఫెయిల్ చేయాలన్న ప్రయత్నం. అయితే దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.