Hari Hara Veera Mallu Animation Video: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu ) మూవీ ఎట్టకేలకు ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజుని తీసేస్తే సరిగ్గా ఈ సినిమా విడుదల అవ్వడానికి పట్టుమని పది రోజులు కూడా లేవు. కానీ మేకర్స్ మాత్రం ప్రొమోషన్స్ సరిగా చేయడం లేదని అభిమానులు సోషల్ మీడియా లో విపరీతంగా నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్ లో మూవీ టీం ని ట్యాగ్ చేస్తూ అసలు ఈ సినిమాని నిజంగానే 12న విడుదల చేస్తున్నారా?, లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దీనిపై మేకర్స్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో ఫ్యాన్స్ మరింత ఫ్రస్ట్రేట్ అయ్యారు. అయితే మేకర్స్ కాసేపటి క్రితమే విడుదల చేసిన ఒక యానిమేషన్ వీడియో సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టించింది.
ఇది కదా మేము నీ నుండి కోరుకున్న ప్రమోషన్స్. ఇలాగే కొనసాగించు అంటూ అభిమానులు ఉత్సాహంగా ఆ వీడియో క్రింద కామెంట్స్ చేసారు. మరికొంత మంది అభిమానులు మాత్రం మాకు ఇప్పుడు ఇవేమి అవసరం లేదు, దయచేసి ట్రైలర్ అప్డేట్ ఇవ్వమని అడుగుతున్నారు. ఈ యానిమేషన్ వీడియో లో ‘మంత్ ఆఫ్ వీరమల్లు’ అనే ట్యాగ్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. థియేటర్స్ గోడ బయట పోస్టర్స్ వేయడం, లోపల కటౌట్స్, బ్యానర్స్ తో నింపి అభిమానులు సంబరాలు చేసుకోవడం వంటివి యానిమేషన్ రూపం లో చూపించడం, బ్యాక్ గ్రౌండ్ లో అసుర హననం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించడం అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ట్రైలర్ అప్డేట్ అధికారికంగా ఇవ్వకపోయినా కనీసం ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటే ఫ్యాన్స్ లో ఉత్సాహం మామూలు రేంజ్ లో ఉండదని, ఒకే ఒక్క చిన్న యానిమేషన్ వీడియో తో సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది అంటున్నారు ఫ్యాన్స్.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 5వ తారీఖున కానీ, 6వ తారీఖున కానీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కేవలం నూతనంగా వచ్చిన VFX షాట్స్ ని జత చేసే ఉద్దేశ్యంతోనే ట్రైలర్ కాస్త ఆలస్యం అయ్యిందని, లేకపోతే రేపే విడుదల అయ్యి ఉండేదని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం వారణాసి లో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ ఈవెంట్ కి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథి గా పాల్గొంటాడని కూడా ప్రచారం సాగింది. కానీ సమయం లేకపోవడం తో వారాణసి ఈవెంట్ రద్దు అయ్యిందట. కేవలం తెలుగు లో మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట. హైదరాబాద్ లో కానీ, తిరుపతి లో కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
Theatres will thunder. ⚡️
Celebrations will erupt.
Let’s celebrate Powerstar @PawanKalyan as #VeeraMallu like never before! #HariHaraVeeraMallu grand release worldwide this JUNE 12th! #HHVMonJune12th #HHVM #DharmaBattle pic.twitter.com/BaiZu9jjsy— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 1, 2025