HHVM 10 Dyas Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ఒక పీడకల లాంటి సినిమా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). మాములుగా ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని అభిమానులు పీడకలగా భావించేవారు. కానీ ఆ సినిమాకు కనీసం ప్రీ రిలీజ్ ముందు క్రేజ్, హైప్, యుఫోరియా వంటివి అభిమానులు సంపూర్ణంగా ఎంజాయ్ చేశారు. కానీ ‘హరి హర వీరమల్లు’ విషయం లో మాత్రం విడుదలకు ముందు పవన్ అభిమానులు పడినంత టార్చర్ ఏ హీరో అభిమాని కూడా అనుభవించి ఉండదు. మేకర్స్ అంతలా వేధించారు. కేవలం ఈ ఒక్క ఏడాది లోనే నాలుగు సార్లు ఈ సినిమా వాయిదా పడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, అభిమానుల ఎమోషన్స్ తో ఎలా ఆడుకున్నారు అనేది. పోనీ అన్ని సార్లు వాయిదా వేసి మంచి క్వాలిటీ కంటెంట్ ఇచ్చారా అంటే అది కూడా లేదు. పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్లి బొమ్మల గుర్రం మీద కూర్చోబెట్టి,గుర్రపు స్వారీ చేస్తున్నట్టు చూపించారు.
మాకు నచ్చింది తీస్తాం, సచ్చినట్టు థియేటర్స్ కి వచ్చి మా సినిమా చూడండి అనే తరహా ధోరణితో నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించినట్టుగా అనిపించింది. ఆడియన్స్ ఫెయిల్యూర్ ని సహిస్తారు, క్షమించి వదిలేస్తారు కానీ, నిర్లక్ష్యంగా వ్యవరిస్తే మాత్రం ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా రిజెక్ట్ చేస్తారు ఆడియన్స్. అదే ఈ సినిమా విషయం లో జరిగింది. ఇకపోతే పది రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ పాతాళంలోకి పడిపోయాయి. కానీ ఈ వీకెండ్ లో మాత్రం వసూళ్లు కాస్త పుజుకున్నాయి. శుక్రవారం వచ్చిన వసూళ్లతో పోలిస్తే శనివారం వచ్చిన వసూళ్లు రెండింతలు ఎక్కువ వచ్చాయి. అంటే శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాల నుండి 17 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, శనివారం రోజున 33 లక్షల రూపాయిల షేర్ వచ్చాయి.
బుక్ మై షో యాప్ లో అయితే శనివారం రోజున ఈ చిత్రానికి 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇక నేడు అయితే గంటకు వెయ్యి కి పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ రెండు రోజులు గ్రోత్ చూపించినా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం మాత్రం అసాధ్యం. తెలుగు రాష్ట్రాలతో కలిపి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 72 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 118 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు రావాల్సిన వసూళ్లు క్లోజింగ్ లో వచ్చాయి అన్నమాట. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జీవితాంతం గుర్తించుకోదగ్గ అవమానం అనుకోవచ్చు. కానీ మరో 50 రోజుల్లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందని, ఈ చిత్రం తో ఆయన కం బ్యాక్ మామూలుగా ఉండదని అంటున్నారు.