Happy Birthday Yash : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు(South Movies) ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు, సౌత్ ఇండియన్స్ మాత్రమే కాకుండా మొత్తం భారతీయ ప్రేక్షకులు, ముఖ్యంగా హిందీ బెల్ట్ ప్రజలు కూడా సౌత్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటానికి ఇష్టపడుతున్నారు. సౌత్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి. సౌత్ ఇండస్ట్రీ ఇలాంటి విజయం సాధించడానికి క్రెడిట్ యష్(Yash) వంటి పాన్ ఇండియా స్టార్ కు కూడా దక్కుతుంది. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో ఫేమస్ అయిన యష్ ఈరోజు తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఇది యష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం.
యష్ తన కెరీర్‌ను 2007లో ప్రారంభించాడు. ‘జంబడ హుడుగి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘రాకీ’(Rocky), ‘గోకుల’, ‘లక్కీ’, ‘జాను’, ‘గూగ్లీ’, ‘గజ్‌కేసరి’ సినిమాల్లో నటించారు. కానీ 2014లో విడుదలైన ‘మిస్టర్ అండ్ మిసెస్ రాంచారి’ చిత్రం ఆయన తలరాతను మార్చింది. ఇది ప్రజల హృదయాలను గెలుచుకుంది.’మిస్టర్ అండ్ మిసెస్ రాంచారి’ బడ్జెట్ కేవలం 5 కోట్లు, కానీ అది 50 కోట్లు రాబట్టింది. యష్‌కి జోడీగా రాధిక పండిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంతోష్ ఆనంద్‌రామ్ దర్శకుడు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా వ్యక్తిగత జీవితానికి కొత్త మలుపు ఇచ్చింది. యష్, రాధిక ప్రేమ కథ ఈ చిత్రం సమయంలోనే ప్రారంభమైంది. వారిద్దరూ 2016 లో వివాహం చేసుకున్నారు.
తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందు యష్ తన కొత్త చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, కియారా అద్వానీ తనకు జోడీగా నటిస్తోంది. ఇది కాకుండా, యష్ త్వరలో ‘కెజిఎఫ్ 3’లో రాకీ భాయ్ పాత్రతో తిరిగి రానున్నారు. రిలీజ్ డేట్ ఇంకా వెల్లడి కానప్పటికీ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా, యష్ బాలీవుడ్ అరంగేట్రం కూడా చేస్తున్నారు. రణబీర్ ‘రామాయణం’లో రావణుడి పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే యష్ అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. యష్ అసలు పేరు ‘నవీన్ కుమార్ గౌడ'(Naveen kumar gowda). యష్ 1986లో ఇదే రోజున ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న మక్కువ అతన్ని సినిమా వైపు ఆకర్షించింది. యష్ 2008లో ‘రాకీ’ సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. యష్ తన కెరీర్‌లో 21కి పైగా సినిమాలు చేశారు.