
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్ దేవరకొండకు సెలబెట్రీలు, అభిమానులు పెద్దసంఖ్యలో విషెష్ చెబుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో విజయ్ దేవరకొండ యువతను ఆకట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత ‘ట్యాక్సీవాలా, ‘గీతగోవిందం’, ‘మహానటి’ మూవీలతో స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఇటీవల విజయ్ నటించిన డియర్ కామ్రేడ్, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కొంత నిరాశపరిచాయి. అయినప్పటికీ యువతలో విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే విజయ్ ఇన్ స్ట్రాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన దక్షిణాది హీరోగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 30ఏళ్లలోపు కంటే తక్కువ వయస్సు కలిగిన పోర్బ్స్ లిస్టులో టాప్ 30చోటు సంపాదించుకున్నాడు.
ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?
నేటితో విజయ్ 31ఏళ్ల పడిలోకి వెళుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్మాథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఫైటర్’లో విజయ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ నటిస్తోంది. బాలీవుడ్లో కరణ్ జోహర్ ‘ఫైటర్’ మూవీని నిర్మిస్తుండగా తెలుగులో పూరి జగన్మాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్మాథ్ విజయ్‌కు ట్విటర్లో విషెస్ చెప్పారు. ‘నేను నీతో ఎంతగా ప్రేమలో ఉన్నానో ఈరోజు మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను.. పనిలో నీకు ఉన్న నిబద్ధత, కసి, పట్టుదల నిన్ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి.. నిన్ను మిస్సవుతున్నా.. త్వరలోనే సెట్స్‌లో కలుద్దాం.. నువ్వు ఎప్పటికీ నా ఫైటర్‌వే.. హ్యాపీ బర్త్‌డే విజయ్’ అంటూ పూరీ ట్వీట్ చేశారు. పలువురు సెలబ్రెటీలు, అభిమానులు విజయ్ కు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.