https://oktelugu.com/

హ్యపీ బర్త్ డే గురూజీ.. టాలీవుడ్లో త్రివిక్రమ్ జర్నీ..!

టాలీవుడ్లో మాటల మాంత్రికుడు.. గురూజీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు ఉంది. నేడు ఆయన పుట్టిన రోజు(నవంబర్ 7). ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ ఇండస్ట్రీగా హిట్టుగా నిలిచింది. దీంతో అగ్రహీరోలంతా ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లోకి మాటల రయితగా ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 10:50 AM IST
    Follow us on

    టాలీవుడ్లో మాటల మాంత్రికుడు.. గురూజీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు ఉంది. నేడు ఆయన పుట్టిన రోజు(నవంబర్ 7). ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ ఇండస్ట్రీగా హిట్టుగా నిలిచింది. దీంతో అగ్రహీరోలంతా ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లోకి మాటల రయితగా ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం కలాన్ని నమ్ముకొని వచ్చి టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. స్వయంవరం.. నువ్వే కావాలి.. చిరునవ్వుతో.. నువునాకు నచ్చావ్.. మల్లీశ్వరి.. మన్మధుడు.. జై చిరంజీవా వంటి సినిమాలతో త్రివిక్రమ్ మాటలు అందించి అతితక్కువ సమయంలోనే స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    Also Read: సోనూ సూద్ ఇంత సాయం ఎందుకు చేస్తున్నాడో తెలుసా?

    నువ్వే.. నువ్వే సినిమాతో త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘అతడు’ మూవీని తెరకెక్కించి కమర్షియల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. అలాగే పవన్ కల్యాణ్ తో జల్సా.. అత్తారింటికి దారేది.. నితిన్ తో అఆ.. ఎన్టీఆర్ తో అరవింద వీరరాఘవ సమేత, అల్లు అర్జున్ తో సన్నఫ్ సత్యమూర్తి.. అలవైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ చేశారు.

    త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ అందరికీ ఆలోచింపజేసేలా ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లోనూ తనదైన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో త్రివిక్రమ్ ది అందెవేసిన చేయి. అందుకే ఆయన మాటలను వినేందుకు తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడు ఇష్టపడుతుంటారు. ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్త్వం త్రివిక్రమ్ ది. దీంతో స్టార్ హీరోలంతా హిట్స్.. ప్లాపులతో సంబంధం లేకుండా ఆయనతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉంటారు.

    Also Read: నిర్మాణ రంగంలోకి అల్లు అర్జున్.. తొలుత వెబ్ సీరిస్?

    త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో త్వరలో ఓ సినిమా రాబోతుంది. త్రివిక్రమ్ ఇలానే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుంటూ విజయాలు అందుకోవాలని ‘ఓకే తెలుగు’ టీమ్ మనసారా కోరుకుంటుంది. వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే గురూజీ.