Hanuman: హనుమాన్ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వండర్స్ క్రియేట్ చేస్తుంది. జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంది. తేజా సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీకి ప్రశంసలు దక్కుతున్నాయి. హిందీ, కన్నడ, తమిళ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇక హనుమాన్ రూ. 100 కోట్ల వసూళ్లు దాటేయడం అనూహ్య పరిణామం. ఈ స్థాయిలో సత్తా చాటుతుందని అసలు ఊహించలేదు.
హనుమాన్ మూవీపై జనాల్లో ఆసక్తి ఉంది. అయితే ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. అందులోనూ మూవీ బడా హీరోలకు పోటీగా విడుదలైంది. వారి ముందు తేజా సజ్జా వంటి చిన్న హీరో నటించిన హనుమాన్ నిలబడుతుందా అనే సందేహాలు ఉన్నాయి. వాటన్నింటినీ హనుమాన్ పటాపంచలు చేసింది. మరొక విశేషం ఏమిటంటే… బుక్ మై షోలో హనుమాన్ రికార్డు క్రియేట్ చేసింది.
హనుమాన్ చిత్రం బుక్ మై షోలో ఏకంగా 2 మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రాన్ని వెనక్కి నెట్టి హనుమాన్ రేర్ ఫీట్ నమోదు చేసింది. కనీసం టైర్ టు హీరోల జాబితాలో కూడా లేని తేజా సజ్జా చిత్రానికి వస్తున్న ఆదరణ అమోఘం అని చెప్పాలి. ఇదంతా కేవలం కంటెంట్ వలనే. స్టార్ క్యాస్ట్ తో సంబంధం లేకుండా సినిమాలో విషయం ఉంటే జనాలు ఆదరిస్తారని తేలిపోయింది.
హనుమాన్ హిందీలో కూడా సత్తా చాటుతుంది. దాదాపు రూ. 20 కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషియో ఫాంటసీ అంశాలతో సూపర్ మ్యాన్ చిత్రంగా హనుమాన్ తెరకెక్కించాడు. లార్డ్ హనుమాన్ ప్రస్తావనతో మూవీ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. హనుమాన్ మూవీలో విలన్ గా వినయ్ రాయ్ నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ చేసింది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.