Hanuman Collections: సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్లే వసూళ్లు ఉన్నాయి. చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ కి మొదటి రోజే భారీ కలెక్షన్స్ దక్కాయి. స్టార్ డమ్ లేని తేజ సజ్జా చిత్రానికి ఇవి ఊహించని వసూళ్లు. హను మాన్ చిత్రంలో స్టార్ క్యాస్ట్ లేకున్నా దర్శకుడు ప్రశాంత్ వర్మకు టాలెంటెడ్ దర్శకుడిగా పేరుంది. ఆయన గత చిత్రాలు జయాపజయాలతో సంబంధం లేకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. హనుమాన్ ప్రోమోలు ఆకట్టుకుగా అంచనాలు ఏర్పడ్డాయి.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబి రెడ్డి మంచి విజయం సాధించింది. వీరి కాంబోలో తెరకెక్కిన రెండో చిత్రం హనుమాన్. హనుమాన్ జనవరి 12న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేశారు. హనుమాన్ మూవీ ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఆడియన్స్ హనుమాన్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం హనుమాన్ ఫస్ట్ డే రూ. 21 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది.
నార్త్ ఇండియాలో కూడా హనుమాన్ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. హిందీ వెర్షన్ రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎలాంటి ప్రొమోషన్స్ లేకుండా ఈ స్థాయి వసూళ్లు అంటే సామాన్యం కాదు. వరల్డ్ మౌత్ బాగున్న నేపథ్యంలో హిందీలో వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది. నైజాం లో హనుమాన్ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. డిమాండ్ ఉన్నా స్క్రీన్స్ లేకపోవడం వలన కొంత మేర వసూళ్లు కోల్పోతుంది.
హనుమాన్ సూపర్ హీరో మూవీగా దర్శకుడు తెరకెక్కించాడు. తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ ఇచ్చిన విజువల్స్ అద్భుతం అంటున్నారు. వంద కోట్ల బడ్జెట్ తో మూవీలు చేసే దర్శకులకు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ ఒక రిఫరెన్స్ అని కొనియాడుతున్నారు. సోషియో ఫాంటసీ చిత్రానికి డివోషనల్ టచ్ ఇచ్చి హనుమాన్ రూపొందించారు. అమృత అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు.