Maruti Cars: మారుతి నుంచి కొత్త ఎంపీవీ కాంపాక్ట్ కారు.. ధర ఇంతగా తగ్గించారెందుకు?

పై ఫొటోలోని వాహనాన్ని చూస్తే ఏదైనా స్కూల్ వ్యాన్ కావొచ్చు.. అని అనుకుంటారు. కానీ దీనిని మారుతి కంపెనీ కొత్తగా డిజైన్ చేస్తోంది. డిఫరెంట్ లుక్ లో ఆకర్షించే డిజైన్ ను కలిగిన దీనిని ప్రస్తుతం ‘మారుతి ఇన్నోవా ఎంపీవీ’గా పేర్కొంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : January 13, 2024 4:37 pm

Maruti Cars

Follow us on

Maruti Cars: దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకీ ఒక సంచలనం. వినియోగదారులు ఏదీ కోరుకుంటే అదే విధంగా మోడళ్లను అందించే సంస్థగా ఈ కంపెనీ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటి వరకు హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్నీ మోడళ్లను పరిచయం చేసింది. ఎప్పటికప్పుడు ఫీచర్స్ ను అప్డేట్ చేస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. అయితే ఎన్ని కొత్త మోడళ్లు తీసుకొచ్చినా మిడిల్ క్లాస్ పీపుల్స్ ను బేస్ చేసుకొని ధరను నిర్ణయిస్తున్నారు. దీంతో మారుతి కార్లంటే క్రేజ్ పెరిగింది. ఇప్పుడు అందరూ ఆశ్యర్యపోయేలా ఓ కొత్త మోడల్ ను పరిచయం చేయబోతంది. దీనిని చూసిన వారు మినీ ఇన్నోవానా? అని అంటున్నారు. చిన్నపాటి బస్ ను తలపించేలా ఉన్న ఈ మోడల్ విశేషాలేంటో తెలుసుకుందాం..

పై ఫొటోలోని వాహనాన్ని చూస్తే ఏదైనా స్కూల్ వ్యాన్ కావొచ్చు.. అని అనుకుంటారు. కానీ దీనిని మారుతి కంపెనీ కొత్తగా డిజైన్ చేస్తోంది. డిఫరెంట్ లుక్ లో ఆకర్షించే డిజైన్ ను కలిగిన దీనిని ప్రస్తుతం ‘మారుతి ఇన్నోవా ఎంపీవీ’గా పేర్కొంటున్నారు. ఈ మోడల్ లో చాలా లైట్ వెయిట్ తో కూడిన ఇంజిన్ ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం మారుతి సుజుకీ, జపాన్ స్పెక్ సుజుకీ కలిసి దీనిని పరిచయం చేయబోతున్నారు. ఇందులో 7 సీటర్ తో పాటు బాక్సీ మోడల్ డిజైన్ ఉంటుంది. సబ్ 4 మీటర్ల విభాగంలో సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ కారు పొడవు 3,395 మిల్లీ మీటర్ల పొడవు ఉంటుంది.ఈ మోడల్ లో స్లైడింగ్ డోర్స్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఇందులో వైడీబీ అనే కోడ్ నేమ్ ను కలిగి ఉంది. ఎంపీవీ కాంపాక్ట్ కలిగిన ఇందులో విశాలమైన స్పేస్ ను కలిగి ఉంది. ఇంజిన్, తదితర విషయాలు వెల్లడించనప్పటికీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు కొత్త Z సిరీస్ ను అమర్చే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు మారుతి ఎంపీవీగా ఎర్టీగాను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు XL6 కంటే తక్కువ రేంజ్ లో దీనిని తయారు చేయనున్నారు.

ఈ మోడల్ పూర్తయిన తరువాత మార్కెట్లో రూ.6.33 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇది రెనాల్ట్ ట్రైబర్ కు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఇదే ధరతో ఇలాంటి మోడల్ రెనాల్ట్ ట్రైబల్ అలరిస్తోంది. ఇప్పుడు మారుతి నుంచి ఈ కొత్త మోడల్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే స్టైలిస్ లుక్ తో పాటు సౌకర్యవంతంగా ఉండేందుకు దీనిని తయారు చేస్తున్నట్లు సమాచారం.