https://oktelugu.com/

Hansika: హన్సిక ఫస్ట్ వెబ్ సిరీస్.. ఎక్కడ రిలీజ్ అవుతుందో తెలుసా?

చైల్డ్ ఆర్టిస్టుగానే హన్సిక సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2001 నుంచి2007 వరకు బాల నటిగా కనిపించింది. ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టింది. అయతే హీరోయిన్ గా మాత్రం హన్సిక తెలుగు మూవీ ‘దేశముదురు’తో ఎంట్రీ ఇచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 14, 2023 / 06:38 PM IST

    Hansika

    Follow us on

    Hansika: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హన్సిక పెళ్లి తరువాత సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. గతంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లయిన తరువాత సినిమాలను పూర్తిగా మానేసేవారు. కానీ ఇప్పుడు వివాహం అయిన కొద్ది నెలల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే కాజల్, నయనతార వంటి వాళ్లు రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తమ ప్రతిభ చూపుతున్నారు. వీరి లాగే హన్సిక కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. అయితే ఆమె తాజాగా వెబ్ సిరీస్ లోకూడా అడుగుపెట్టబోతుంది. దాని పేరు ‘MY3′. ఇది ఏ ప్లాట్ ఫాం పై రిలీజ్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా?

    చైల్డ్ ఆర్టిస్టుగానే హన్సిక సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2001 నుంచి2007 వరకు బాల నటిగా కనిపించింది. ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టింది. అయతే హీరోయిన్ గా మాత్రం హన్సిక తెలుగు మూవీ ‘దేశముదురు’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేశారు. ఫస్ట్ మూవీతోనే హన్సిక పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళంలోనూ ఛాన్సులు దక్కించుకుంది. ఇలా కొన్నాళ్ల పాటు తన హవా చూపించిన హన్సిక గత డిసెంబర్ లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు.

    కొన్నాళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హన్సిక సోషల్ మీడియాలో మాత్రం భర్తతో కలిసి ఫోజులిస్తూ దిగిన ఫొటోలు హల్ చల్ చేశాయి. ఈ తరుణంలోఆమె ఫ్యాన్స్ మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తారు? అంటూ ప్రశ్నలు వేశారు. ఈ సమయంలో ఎటువంటి రిప్లై ఇవ్వని హన్సిక సడెన్లీగా అందరికీ సర్ ఫ్రైజ్ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కొన్నిసినిమాల్లో నటించింది. వీటిలో ఆది పినిశెట్టితో కలిసి ‘పార్ట్ నర్’ ఒకటిగా చెప్పవచ్చు. అయితే ఫస్ట్ టైం ఓటీటీ లో ‘MY3′ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది.

    వైవిధ్యమైన కాన్సెప్టుతో ఆసక్తిని కలిగించే ఈ మూవీలో మూగెన్ రావు హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజేష్ ఎం డైరెక్షన్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 15 నుంచి ప్రసారం కానుంది. ఇందులో హన్సికతో పాటు శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండ్రోజుల ముందుగా రిలీజైన ట్రైలర్ తో రెస్పాన్స్ రావడంతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు హన్సిక మొదటిసారిగా వెబ్ సిరీస్ లో నటంచడంతో ఆమెను చూసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.