Hansika Marriage: సినీ స్టార్ హన్సిక ఇన్నాళ్లకు పెళ్లిపీటలకెక్కబోతుంది. ఇన్నాళ్లు ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం సాగించి..అతడినే వివాహం చేసుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి పులిస్టాప్ పెట్టి తాను ఓ వ్యక్తితో ఏడుడుగులు నడుస్తున్నానని ప్రకటించింది. ఈ మేరకు తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాకు షేర్ చేసింది. ఇటీవల ఈఫిల్ టవర్ వద్ద, హన్సిక తన కాబోయే భర్తతో ఫోటో షూట్ కు ఫోజులిచ్చింది. ఎంతో సంతోషంగా కనిపిస్తున్న హన్సికను చూసి ‘మీది లవ్ మ్యారేజీనా..?’అని కొందరు కొశ్చన్ చేశారు. దీంతో ఆమె అభిమానులకు ఆమె ‘అవును’ అని రిప్లై ఇచ్చింది. ఈ తరుణంలో హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు..? ఏం చేస్తారు..? హన్సికకు ఎలా పరిచయం అయ్యారు..? అనే విషయాలపై సెర్చ్ చేస్తున్నారు.

హన్సికకు కాబోయే భర్త పేరు సోహైల్ కథురియా. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. కానీ సోహైల్ కథురియా ఓ వ్యాపార వేత్త. ఈయనకు సినీ ఇండస్ట్రీతో ఎటువంటి సబంధం లేదు. సోహైల్ చిన్నప్పటి నుంచే హన్సికకు పరిచయం. వీళ్లిద్దరూ ఒకే స్కూల్ లో చదివారు. ఆ తరువాత హన్సిక సినిమాల్లోకి రాగా.. సోహైల్ బిజినెస్ తో బిజీ అయ్యారు. అయితే హన్సికకు సినిమా అవకాశాలు తగ్గాక.. సోహైల్ తో ఓ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇది సక్సెస్ కావడంతో స్నేహితులైన వీరు ప్రేమికులుగా మారారు. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కొన్ని రోజుల కిందట తాను పెళ్లి చేసుకుంటున్నానని అధికారికంగా ప్రకటించింది హన్సిక. అంతేకాకుండా జైపూర్ ప్యాలెస్ లో ఎన్ని గదులు బుక్ చేసుకుందో చెప్పింది. దీంతో హన్సిక కాబోయే భర్త ఎవరు..? అని చాలా మంది అడిగారు. కానీ అప్పుడు చెప్పలేదు. రెండు రోజుల కిందట ఏకంగా ఆమె ప్రియుడితో కలిసి ఈఫిల్ టవర్ దగ్గర దిగిన ఫొటోలు షేర్ చేయడంతో ఆడియన్స్ షాక్ తిన్నారు. కొందరు మీ జంట చూడముచ్చటగా ఉందని కామెంట్లు పెట్టారు.

ఇక వీరి పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.. తెలుగులో ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కంత్రి, విజయీభవ, ఓమై ఫ్రెండ్ వంటి పలు సినిమాల్లో నటించారు. తమిళంలోనూ పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పెళ్లి తరువాత హన్సిక సినిమాల్లో కనిపిస్తుందా..? లేక బిజినెస్ తో బిజీ అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.