https://oktelugu.com/

Hamsa Nandini: సన్యాసిగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్… ఆశ్రయంలో ప్రత్యక్షం!

ఇటీవల హంసా నందిని కాన్సర్ బారిన పడ్డారు. ఆమె సుదీర్ఘ కాలం క్యాన్సర్ కి చికిత్స తీసుకున్నారు. ఆ మహమ్మారితో పోరాడారు. పలుమార్లు హంసా నందిని కీమోథెరపీ తీసుకున్నారు. ఆ సమయంలో జుట్టు తీయించేసి హంసా నందిని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎట్టకేలకు ఆమె తిరిగి కోలుకున్నారు. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా వేదికగా తన మానసిక వేదన, స్థితి తెలియజేశారు. క్యాన్సర్ తో పోరాడి గెలవొచ్చని ఇతర క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్తైర్యం నింపారు.

Written By:
  • Shiva
  • , Updated On : June 27, 2023 / 01:45 PM IST

    Hamsa Nandini

    Follow us on

    Hamsa Nandini: టాలీవుడ్ ఐటెం భామగా హంసా నందినికి పేరుంది. ఈ గ్లామరస్ హీరోయిన్ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. పూణేకి చెందిన హంసా నందిని 2004లో విడుదలైన ‘ఒక్కటవుదాం’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. తెలుగులో ఆమె వరుసగా చిత్రాలు చేశారు. అధినేత, ప్రవరాఖ్యుడు, అహనా పెళ్ళంట, ఈగ చిత్రాల్లో నటించారు. మిర్చి మూవీలో మొదటిసారి ఐటెం సాంగ్ చేసింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సూపర్ హిట్ కావడంతో హంసా నందిని ఫేమ్ తెచ్చుకుంది.

    అనంతరం భాయ్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా, లెజెండ్ తో పాటు మరికొన్ని చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. జై లవకుశ మూవీలో బ్యాంక్ ఎంప్లొయ్ గా మెరిసింది. హంసా నందిని వెండితెరపై కనిపించిన చివరి చిత్రం పంతం. గోపిచంద్ హీరోగా నటించారు.

    ఇటీవల హంసా నందిని కాన్సర్ బారిన పడ్డారు. ఆమె సుదీర్ఘ కాలం క్యాన్సర్ కి చికిత్స తీసుకున్నారు. ఆ మహమ్మారితో పోరాడారు. పలుమార్లు హంసా నందిని కీమోథెరపీ తీసుకున్నారు. ఆ సమయంలో జుట్టు తీయించేసి హంసా నందిని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎట్టకేలకు ఆమె తిరిగి కోలుకున్నారు. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా వేదికగా తన మానసిక వేదన, స్థితి తెలియజేశారు. క్యాన్సర్ తో పోరాడి గెలవొచ్చని ఇతర క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్తైర్యం నింపారు.

    హంసా నందిని లేటెస్ట్ లుక్ చూసిన జనాలు షాక్ అయ్యారు. ఆమె సన్యాసిగా మారిపోయారు. ట్రెండీ బట్టల్లో హాట్ గా కనిపించే హంసా నందిని కాస్తా నిండైన దుస్తుల్లో ప్రశాంతంగా కనిపించారు. ఓ ఆశ్రమంలో ఆమె దర్శనమిచ్చారు. హంసా నందిని సన్యాసిగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె సినిమాలు మానేశారని ప్రచారం అవుతుంది. హంసా నందిని నిర్ణయం ఆమె అభిమానులను నిరాశపరిచింది. ఇకపై సన్యాసిగా ప్రశాంత జీవితం గడపాలని ఆమె డిసైడ్ అయినట్లున్నారు.