Hamsa Nandini: ‘సినీ పరిశ్రమలో ఎవరు ఫేట్ ఎలా రాసి ఉందో ఎవ్వరూ చెప్పలేరు’ అని సినీ జనాలు రెగ్యులర్ గా చెప్పుకునే మాట. గత కొన్ని నెలలుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న టాలీవుడ్ నటి హంసనందిని తన తాజా ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పటివరకు 16 దశల కీమోథెరపీ విజయవంతంగా పూర్తయ్యిందని తెలిపింది.

ఇంకా పోరాటం ముగియలేదని, విజయం సాధించలేదని పేర్కొంది. తదుపరి పోరాటం కోసం సిద్ధమవుతున్నానని, సర్జరీలకు వెళ్లాల్సిన సమయమని చెప్పింది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ గర్ల్ గా పలు చిత్రాల్లో నటించి అలరించిన ‘హంసా నందిని’ ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాటం చేస్తోంది.
Also Read: పవన్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన నాగబాబు.. బోడిగుండు పోస్టుతో ఇలా చేశారేంటి
ఆమె రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3తో బాధపడుతుంది. తనకు క్యాన్సర్ ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తూ.. క్యాన్సర్ తో పోరాడుతున్నానని, కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పడం నెటిజన్లను కదిలించింది. అలాగే అప్పుడు ఆమె షేర్ చేసిన ఫొటోలో పూర్తి గుండుతో కనిపించింది.

అసలు ఈ క్యాన్సర్ గురించి ఆమెకు ఎప్పుడు తెలిసింది అంటే.. తన బ్రెస్ట్ లో లంప్ ఉన్నట్లుగా హంసానందిని గుర్తించింది. కాగా మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల్లో ఈమె నటించింది. ఆమె త్వరలో కోలుకుని మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని కోరుకుందాం. అదేంటో గాని హంసనందినికి మొదటి నుంచి పెద్దగా కలిసి రావడం లేదు. భవిష్యత్తులో అయినా ఆమెకు కాలం కలిసి రావాలని.. ఆమె మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.
Also Read: ఇండస్ట్రీ పెద్దల మౌనాన్ని ఈ ఒక్క ట్వీట్ తో పవన్ కడిగేశాడా?
Recommended Video: