https://oktelugu.com/

‘గుర్తుందా శీతాకాలం’లో మరో భామ ఎవరంటే?

యంగ్ హీరో సత్యదేవ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూవీలో సత్యదేవ్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా తాజాగా మరో హీరోయిన్ ను చిత్రయూనిట్ ఖరారు చేసింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఛల్ మోహనరంగ.. లై తదితర సినిమాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మేఘా ఆకాశ్ ఈ మూవీలో నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 12:12 PM IST
    Follow us on

    యంగ్ హీరో సత్యదేవ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ మూవీలో సత్యదేవ్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా తాజాగా మరో హీరోయిన్ ను చిత్రయూనిట్ ఖరారు చేసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఛల్ మోహనరంగ.. లై తదితర సినిమాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మేఘా ఆకాశ్ ఈ మూవీలో నటించనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సత్యదేవ్ కు జోడీగా తమన్నా నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.

    Also Read: మళ్లీ వాయిదా పడిన అల్లు అర్జున్ ‘పుష్ప’.. కారణమెంటీ?

    మేఘా ఆకాశ్ కు 2020 బాగానే కలిసొచ్చినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మనుచరిత్ర’ సినిమాలో నటిస్తుండగా తాజాగా ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ ఆఫర్ దక్కించుకుంది. దీంతోపాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ మూవీ షూటింగులో మేఘా ఆకాశ్ పాల్గొననుంది.

    Also Read: బిగ్ బాస్ ఎంట్రీతో అవినాష్ కు జబర్దస్ గేట్లు క్లోజ్..!

    ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్ ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీరవాణి కుమారుడు కాల భైర‌వ సంగీతం అందిస్తుండగా సినిమాను నాగశేఖర్‌, భావన రవిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రయూనిట్ ప్రకటించింది.