ఇక వసు.. రిషి అన్న మాటలను తలుచుకొని శిరీష్ పై కోపంతో రగిలిపోతున్న సమయంలో శిరీష్ ఫోన్ చేసి బయటికి వెళ్దామని అంటాడు. ఇక వసు శిరీష్ ను కోపంగా తిడుతూ.. ఎక్కడికి రాను రిషి సార్ కి తెలిస్తే గొడవ అవుతుందని రాను అంటుంది. ఇక శిరీష్ నువ్వు రాకుంటే మన ఊరిపైనే ఒట్టు అని అనేసరికి ఏమి చేయలేక వెళ్లడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో అక్కడికి మహేంద్ర భూషణ్ రావడంతో శిరీష్ తో బయటికి వెళ్లాల్సిన విషయాన్ని చెప్పి పర్మిషన్ తీసుకొని వెళుతుంది.
మరోవైపు రిషి.. తమ ప్రాజెక్టు గురించి మీటింగ్ పెట్టగా అందులో జగతి కూడా ఉంటుంది. అక్కడికి మహేంద్ర కూడా వచ్చి కూర్చుంటాడు. ఈ ప్రాజెక్టు గురించి వసు వివరిస్తుందని అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు. ఇక వసు కోసం రిషి ఎదురుచూడగా.. వసు లేదని బయటకు వెళ్లిందని మహేంద్ర చెబుతాడు. దీంతో రిషి కోపంతో రగిలిపోతూ జగతి మేడమ్ ను ప్రశ్నిస్తాడు. గతంలో జగతి.. వసు ఎక్కడికెళ్లినా తనకు చెప్పి వెళ్తుందని అనడంతో ఆ విషయాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తాడు రిషి. వెంటనే జగతి వీడికి అడ్డంగా బుక్కయ్యాను అనుకుంటుంది. సాఫ్ట్ గా మాట్లాడుతూనే తిడుతున్నాడని అనుకుంటుంది.
వసుకి ఫోన్ చేయడంతో ఆ ఫోన్ శిరిష్ తీసుకొని కట్ చేస్తాడు. ఇక రిషి మరింత ఫైర్ అవుతాడు. మీటింగ్ క్యాన్సిల్ అని అక్కడి నుంచి వెళ్తుండగా మహేంద్ర వచ్చి రిషి తో మాట్లాడతాడు. ఆ సమయంలో వారి మధ్య కాస్త ఫన్నీ సన్నివేశం కనిపిస్తుంది. మరోవైపు వసు శిరీష్ తో ఓ కాఫీ షాప్ కి వెళ్లగా అక్కడ రిషి గురించి భయపడుతుంది. ఇక గతంలో శిరీష్ రిషి గురించి పెట్టిన నెగటివ్ మెసేజ్ ను రిషి సార్ చూశాడు అనేసరికి శిరీష్ టెన్షన్ పడతాడు. రిషి కారులో బయలుదేరుతూ వసును తలుచుకొని పొగరు అనుకుంటూ తిడతాడు. తరువాయి భాగం లో రిషి కూడా కాఫీ షాప్ లో ఉండటంతో అక్కడ వసును గట్టిగానే వాదించినట్లు కనిపిస్తుంది. మొత్తానికి రిషితో వసుకి మూడిందనే చెప్పాలి