Bigg Boss Telugu Season 8: గుప్పెడంత మనసు స్టార్ మా సక్సెస్ఫుల్ సీరియల్స్ లో ఒకటి. ఈ ధారావాహిక మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. అతి త్వరలో శుభం కార్డు పడనుంది. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంత సడన్ గా సీరియల్ ని క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. గుప్పెడంత మనసు లో వసుధార – రిషి పాత్రలు చేసిన నటులు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట.
గుప్పెడంత మనసు సీరియల్ లో మొన్నటి వరకు రిషి లేకపోవడంతో పరమ బోరింగ్ గా సాగింది. అర్ధాంతరంగా రిషి క్యారక్టర్ ని చంపేయడంతో ఫాన్స్ భాద పడ్డారు. గుప్పెడంత మనసు రేటింగ్ కూడా పడిపోయింది. ఇక సరైన టైంలో రిషి ఎంట్రీ ఇవ్వడం. రిషి – వసుధారలు కలిసిపోవడంతో ఫ్యాన్స్ సంబరపడిపోయారు. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై రిషిధార కెమిస్ట్రీ చూసి ఆనందించారు. గుప్పెడంత మనసు సీరియల్ తిరిగి పూర్వ వైభవం వచ్చింది.
ఇలాంటి సమయంలో సీరియల్ హడావుడిగా ముగించడం ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకరకంగా అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే తాజాగా తెరపైకి వచ్చిన వార్త వాళ్ళను సంతోషానికి గురి చేస్తుంది. మధ్యంతరంగా గుప్పెడంత మనసు కు ముగింపు పలకడానికి కారణం బిగ్ బాస్ షోనే అట. రిషి అలియాస్ ముకేశ్ గౌడ, వసుధార అలియాస్ రక్షా గౌడ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారట.
అలాగని వీరిద్దరూ ఒకే షో లో కంటెస్ట్ చేయడం లేదు. రక్ష, ముకేశ్ గౌడ కన్నడ నటులు. వీరికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. త్వరలో కన్నడ లో కూడా బిగ్ బాస్ సీజన్ 11 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముకేశ్ గౌడ కు కన్నడ బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ముకేశ్ గౌడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఇక రక్ష గౌడ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో పార్టిసిపేట్ చేయనుంది అని టాక్ వినిపిస్తోంది.
సీరియల్ లో దూరమైనప్పటికీ బిగ్ బాస్ ద్వారా రిషి- వసుధార సందడి చేయనున్నారు. అయితే ఈ వార్తలో నిజం ఎంతుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే ముకేశ్ గౌడ – రక్ష గౌడ లకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రిషి కి తెలుగుతో పాటు కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉంది. రిషి ఆర్మీ పేరుతో ఓ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు. ముకేశ్ బిగ్ బాస్ కి వెళితే విన్నర్ అవడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనిపై కొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.